సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. కానీ కొంత మంది మాత్రమే హీరోల స్థాయి ఈమేజ్ ను సొంతం చేసుకుంటూ ఉంటారు. హీరోల స్థాయి ఈమేజ్ ను సొంతం చేసుకున్న హీరోయిన్లు నటించిన సినిమాలకు అదిరిపోయే రేంజ్ బిజినెస్లు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఆ సినిమాలకు మంచి టాక్ వచ్చినట్లయితే సూపర్ సాలిడ్ కలెక్షన్లు కూడా వస్తూ ఉంటాయి. అలా హీరోల స్థాయి ఈమేజ్ ను దక్కించుకున్న అతి కొద్ది మంది నటిమనులలో సాయి పల్లవి ఒకరు. ఈమె ఇప్పటికే నటించిన సినిమాలలో చాలా సినిమాలతో మంచి విజయాలను అందుకుంది. ఇప్పటివరకు ఈమె ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాలో జోలికి వెళ్లకుండా అద్భుతమైన కథనంతో సాగే సినిమాలలో ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తుంది. సాయి పల్లవి తన కెరియర్లో చాలా సినిమాలను రిజక్ట్ చేసింది. సాయి పల్లవి రిజెక్ట్ చేసిన సినిమాలలో చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. సాయి పల్లవి రిజక్ట్ చేసిన మూవీలు ఏవి ..? అవి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాలను సొంతం చేసుకున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ కొన్ని సంవత్సరాలు క్రితం డియర్ కామ్రేడ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీలో సాయి పల్లవిని హీరోయిన్గా అనుకున్నారట. కానీ ఈమె మాత్రం ఈ సినిమా ఆఫర్ను రిజక్ట్ చేసిందట. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన సర్కారు వారి పాట సినిమాలో కూడా ఈమెని హీరోయిన్గా అనుకున్నారట. కానీ ఈమె ఈ ఆఫర్ ను కూడా రిజక్ట్ చేసిందట. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన భోళా శంకర్ మూవీ లో చిరంజీవికి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటించింది. ఈ పాత్రలో మొదట సాయి పల్లవిని అనుకున్నారట. కానీ ఈమె ఆ పాత్రను రిజెక్ట్ చేసిందట. ఇక తమిళ నటుడు తలపతి విజయ్ హీరోగా రూపొందిన లియో మూవీలో కూడా మొదట ఈమెను హీరోయిన్గా అనుకున్నారట. ఈ మూవీ ఆఫర్ ని కూడా ఈమె రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: