
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కోట శ్రీనివాసరావు మరణం తనని చాలా బాధకు గురిచేస్తుందని నిన్నటి రోజున రాత్రి కూడా తనతో మాట్లాడానని కోట మరణ వార్త విని తనని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ బాబు మోహన్ ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడారు. ఇదంతా ఇలా ఉంటే కోట మరణ వార్త విన్న ప్రముఖులు సైతం షూటింగులు రద్దు చేసుకొని మరి హైదరాబాద్ కి చేరుకుంటున్నారు. ఫిలింనగర్ లో ఉంటున్న నివాసంలో కోట భౌతికాయం ఉన్నది. పలువురు సెలబ్రిటీలు రాజకీయ నేతలు కూడా నివాళులు అర్పిస్తున్నారు.
కోట శ్రీనివాసరావు ఇప్పటికే సుమారుగా 700 కు పైగా సినిమాలలో నటించారు. ఈయన ఒకప్పుడు బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత నాటకాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో ఆ వైపుగా అడుగులు వేసి 1978లో ప్రాణం ఖరీదు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంత ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి విలన్ గా ,కమెడియన్ గా అద్భుతమైన నటనతో పేరు సంపాదించారు కోట శ్రీనివాసరావు. ముఖ్యంగా కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తూ ఉండేవి. సుమారుగా వీరిద్దరూ కలిసి 60కుపైగా చిత్రాలను కలిసి నటించారు. 2015లో కోట శ్రీనివాసరావు పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.