తెలుగు తెరపై తక్కువ సినిమాల్లోనే న‌టించిన‌ హీరోయిన్ అమిషా పటేల్, ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్‌లో ఉంది. తన వయసు 50 ఏళ్లు అయినా సరే.. గ్లామర్ పరంగా కుర్ర హీరోయిన్లకు పోటీగా నిలుస్తోంది. అంతేకాకుండా, “ఆంటీ రోల్స్ చేయను, నేను హీరోయిన్లా నటిస్తా” అంటూ క్లారిటీ ఇస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తెలుగు ప్రేక్షకులకు అమిషా పటేల్ పరిచయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘బద్రి’ సినిమాతో జరిగింది. హోమ్లీ లుక్, గ్లామరస్ స్క్రీన్ ప్రెజెన్స్ తో అప్పట్లోనే అమిషాకు భారీ ఫాలోయింగ్ వచ్చింది. ఆ తర్వాత మహేష్ బాబు సరసన ‘నాని’, ఎన్టీఆర్ పక్కన కొన్ని చిత్రాల్లో నటించింది . తెలుగుతో పాటు హిందీ పరిశ్రమలోనూ వరుసగా సినిమాలు చేసింది. ‘కహో నా ప్యార్ హై’, ‘గదర్’, ‘హమ్‌రాజ్’, ‘ఎలాన్’ వంటి చిత్రాల్లో నటించి బాలీవుడ్ ప్రేక్షకుల మనసులు గెల్చుకుంది . 

ఒక దశలో అమిషా అత్యధిక పారితోషికం తీసుకున్న తారల జాబితాలో కూడా నిలిచింది. కొందరు తారల భవితవ్యం ఎప్పుడూ ప్లాన్ ప్రకారం జరగదు. అలా అమిషా కెరీర్ కూడా కొన్ని సినిమాల ఫెయిల్యూర్స్ తర్వాత నెమ్మదించింది. వరుసగా అవకాశాలు తగ్గిపోయాయి. సినిమాలకు కొంతకాలం బ్రేక్ తీసుకుని బయటకే వెళ్లిపోయింది . కానీ ఆమె ఎప్పటికీ పక్కకు తప్పలేదు. గ్లామర్, ఫిట్‌నెస్ తో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి ఫ్యాన్స్‌కు టచ్ లో ఉండిపోయింది. తాజాగా బాలీవుడ్ లో సన్నీ డియోల్ సరసన ‘గదర్ 2’ అనే బిగ్ బడ్జెట్ సినిమాతో అమిషా పటేల్ గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో, ఆమె మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది. ఇది చూసిన దర్శక నిర్మాతలు ఆమెను సీనియర్ హీరోల సరసన హీరోయిన్ రోల్స్‌కు సెట్ చేస్తున్నారట. ఎందుకంటే ఆమె గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ ఇంకా అలాగే ఉన్నాయంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు . 


తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమిషా పటేల్ మాట్లాడుతూ, "నేను ఆంటీ రోల్స్ చేయను. నన్ను ఇప్పటికీ గ్లామర్‌స్ లీడ్‌గా ఆడియన్స్ చూస్తున్నారు. అలాంటి పాత్రలే నేను ఎంచుకుంటాను." అంటూ చెప్పింది. 50 ఏళ్ల వయసులోనూ, యంగ్ హీరోయిన్లకు పోటీగా గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్ వేదికగా ఈ బ్యూటీ పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలు హీటెక్కిస్తున్నాయి. ట్రెడిషనల్ లుక్‌లోనూ, మోడ్రన్ అవతారంలోనూ అదే ఎనర్జీ, అదే స్టైల్ తో అమిషా కనిపిస్తోంది. ఫిట్నెస్ మెంటైనెన్స్ చూస్తే నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు గ్లామర్ క్వీన్‌గా వెలుగొందిన అమిషా పటేల్.. ఇప్పుడు మరోసారి వెండితెరపై వెలుగులు చిందించడానికి సిద్ధమవుతోంది. ఆమె నిర్ణయం స్పష్టమైంది – "హీరోయిన్ రోల్స్ మాత్రమే". ఇక చూడాలి, రీ ఎంట్రీ తర్వాత ఆమె కెరీర్ రెండో ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో !





మరింత సమాచారం తెలుసుకోండి: