నాచురల్ స్టార్ నాని కొంత కాలం క్రితమే హిట్ ది థర్డ్ కేస్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం నాని , శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. గతంలో వీరి కాంబోలో వచ్చిన దసరా మూవీ మంచి విజయం సాధించడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అంచనాలకు తగినట్లు గానే ఈ మూవీ బృందం వారు కొంత కాలం క్రితం విడుదల చేసిన గ్లీమ్స్ వీడియో కూడా సూపర్ గా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు తార స్థాయికి చేరిపోయాయి.

అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని ఖయాదు లోహర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ శ్రీ విష్ణు హీరోగా రూపొందిన అల్లూరి అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. కొంత కాలం క్రితం ఈమె డ్రాగన్ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఈ బ్యూటీ ది ప్యారడైజ్ మూవీ లో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో ఈమె వేశ్య పాత్రలో కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఈమె వేశ్య పాత్రలో నటించినట్లయితే ఈ బ్యూటీ కి ఈ రోల్ ఎంతో చాలెంజింగా  ఉండే  అవకాశం ఉంది అని , ఈ సినిమా కనుక మంచి విజయం సాధిస్తే ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది భావిస్తున్నారు. ఏదేమైనా కూడా ఈమె చాలా తక్కువ కాలం లోనే తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకొని నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: