టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ తాజాగా వార్ 2 అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో హృతిక్ రోషన్ కూడా హీరో గా నటించాడు. ఈ మూవీ ని ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కుల కోసం భారీ ఎత్తున పోటీ నెలకొంది అని అనేక వార్తలు బయటకు వచ్చాయి. ఈ మూవీ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను ప్రముఖ నిర్మాత అయినటువంటి సూర్య దేవర నాగ వంశీ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

తారక్ ఆఖరుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ యొక్క తెలుగు రాష్ట్రాల హక్కులను కూడా నాగ వంశీ దక్కించుకున్నాడు. ఇక ఈయన దేవర పార్ట్ 1 మూవీ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేశాడు. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లను కూడా వసూలు చేసింది. దానితో వార్ 2 తెలుగు రాష్ట్రాల హక్కులను కూడా ఈయన దక్కించుకున్నాడు అనే వార్త బయటకు రావడంతో తారక్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.

వార్ 2 మూవీ లో తారక్ పాత్ర నిడివి అత్యంత తక్కువగా ఉంటుంది అని ఓ వార్త వైరల్ అయింది. దానితో తారక్ అభిమానులు కూడా కాస్త డిసప్పాయింట్ అయ్యారు. తాజాగా నాగ వంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... వార్ 2 మూవీలో కేవలం 30 నిమిషాలు మాత్రమే తారక్ కనిపించడు అని , మిగతా సినిమా మొత్తం కనిపిస్తాడు అని చెప్పేసాడు. దీనితో వార్ 2 సినిమాపై తారక్ అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: