
హరిహర వీరమల్లు సినిమాపై అప్డేట్ ఇవ్వట్లేదు అని .. పవన్ కళ్యాణ్ టైం వేస్ట్ చేస్తున్నారు అని .. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు అంటూ రక రకాలుగా వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయేలా చేసింది ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత అని చెప్పడంలో సందేహం లేదు . మరీ ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్స్ సినిమాకి నెల రోజుల ముందు నుంచే పబ్లిసిటీ , ప్రమోషన్స్ చేసుకుంటూ ఉంటారు . పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాకి సంబంధించి ఏదో ఒక విషయాన్ని చర్చిస్తూ ఉంటారు . కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం సినిమా రిలీజ్ కి రెండు అంటే రెండు రోజులు ముందు నుంచి మాత్రమే ప్రమోషన్స్ లో పాల్గొన్నారు . ఇంకా పక్కాగా చెప్పాలి అంటే ఐదేళ్లు ఈ సినిమా సెట్స్ పై ఉన్నా రాని హైప్ కేవలం పవన్ కళ్యాణ్ రెండు రోజులు చేసిన ప్రమోషన్స్ కి వచ్చేసింది .
దీనితో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ని ప్రశంసిస్తూ మిగతా బిగ్ బడా పాన్ ఇండియా స్టార్స్ తమ సినిమాల విషయంలో ప్రమోషన్స్ ఎలా చేయాలి అనేది నేర్చుకోవాలి . సినిమాకి ప్రమోషన్స్ అనేది ఇంపార్టెంట్ కానీ కధా కంటెంట్ అనేది ముఖ్యంగా చూసుకోవాలి అంటూ సజెస్ట్ చేస్తున్నారు. అంతేకాదు సినిమా రిలీజ్ కి నెలరోజులు ముందు నుంచే నానా హంగామా చేయాల్సిన అవసరం లేదు అని .. కరెక్ట్ గా ఎప్పుడు..? ఎలా..? ఎంత ప్రమోషన్స్ చేయాలో తెలిస్తే ఆ సినిమా హిట్ అయిపోయినట్లే అని ..అది పవన్ కళ్యాణ్ దగ్గరనుంచి చూసి మిగతా స్టార్స్ నేర్చుకుంటే బాగుంటుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు .
అంతేకాదు మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒకపక్క ఏపీ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే రోజు రెండు గంటల సమయం కేటాయించి సినిమా షూట్ ని కంప్లీట్ చేశారు. కొంతమంది హీరోలు ఏళ్లకి ఏళ్లు సినిమా సెట్స్ పై అలానే కొనసాగిస్తూ ఉంటారు . పైగా వాళ్లకి వేరే పని కూడా ఉండదు . ఫ్యామిలీతో వెకేషన్స్ . సరదా సరదా ట్రిప్స్ ఇలానే టైం వేస్ట్ చేస్తూ ఉంటారు . అలాంటివన్నీ మానుకుంటే బెటర్ అని పవన్ కళ్యాణ్ ని చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకోండి అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూసింత గట్టిగా సజెషన్స్ ఇస్తున్నారు . ఇవి మిగతా హీరోల ఫ్యాన్స్ కి కొంచెం మండించే విధంగా కూడా ఉన్నాయి..!!