సాధారణంగా సెలబ్రిటీలను పెళ్లి గురించి ప్రశ్నిస్తే తమకిప్పుడు ఆ ఆలోచన లేదంటూ మాట దాటేస్తుంటారు. పాస్ట్ లో విఫలమైన ప్రేమ కథల కారణంగా కొందరు పెళ్లిపై అయిష్టత కూడా వ్యక్తం చేస్తుంటారు. కానీ ప్రముఖ స్టార్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఈ అమ్మడు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు పిల్లల‌ను క‌నాలి అని తెగ‌ ఆరాటపడుతుంది. కానీ ఆ దిశగా అడుగులు వేయలేకపోతోంది. మరి అందుకు అడ్డుప‌డుతుందెవ‌రు? పెళ్లి గురించి మృణాల్ ఠాకూర్ ఏం చెబుతోంది? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.


మరాఠీలో ఫిల్మ్ కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్‌.. ఆ త‌ర్వాత బాలీవుడ్ కు షిఫ్ట్ అయ్యి అక్క‌డ‌ బిజీ హీరోయిన్‌గా మారింది. 2022లో `సీతారామం` మూవీతో టాలీవుడ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అప్ప‌టి నుంచి తెలుగులో సెల‌క్టివ్‌గా సినిమాలు చేస్తూనే.. బాలీవుడ్ లోనూ స‌త్తా చాటుతోంది. త్వ‌ర‌లోనే `సన్ ఆఫ్ సర్దార్ 2` మూవీతో నార్త్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతుంది. అయితే ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న మృణాల్‌.. పెళ్లి, పిల్ల‌ల గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.


వివాహం మరియు పిల్లలను కనడం పట్ల చాలా ఆసక్తిగా ఉన్నాన‌ని, తల్లి కావడం తన కల అని మృణాల్ వెల్లడించింది. కాబోయే భర్త, పిల్లల విషయంలో ఎప్ప‌టినుంచో కలలు కంటూ ఉన్నాన‌ని.. కానీ దేనికైనా ఒక రైట్ టైమ్ రావాల‌ని మృణాల్ అంటోంది. నటిగా తాను ఇంకా చాలా సాధించాల‌ని.. కెరీర్‌ పరంగా సంతృప్తి చెందాకే పెళ్లి చేసుకుంటాన‌ని మృణాల్ పేర్కొంది. మొత్తంగా పెళ్లి చేసుకోవాలని, పిల్ల‌ల‌ను క‌నాల‌నే త‌ప‌న ఉన్న కెరీర్ కోసం మృణాల్ ఆ రెండింటినీ పోస్ట్ పోన్ చేస్తుంద‌ని స్ప‌ష్ట‌మైంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: