సినిమా ఫీల్డ్ లో కొంతమంది నటీనటులు ఒక్కసారిగా పేరు తెచ్చుకొని ఆ తర్వాత కనుమరుగవుతూ ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్లు ఎక్కువగా ఉంటారు. కొంతమంది స్టార్డం రాకపోయినా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా మరి కొంతమంది స్టార్డం వచ్చినా కానీ అకస్మాత్తుగా సినిమాలు మానేసి వెళ్ళిపోతూ ఉంటారు.. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆనందం సినిమా హీరోయిన్ రేఖా వేదవ్యాస్.. ఈమె చేసిన మొదటి చిత్రం ఆనందం అద్భుతమైన హిట్ సాధించింది. ఈ సినిమా తర్వాత ఆమెకు దొంగోడు, జానకి వెడ్స్ శ్రీరామ్,ఒకటో నెంబర్ కుర్రాడు, ప్రేమించుకున్నాం పెళ్లికి రండి వంటి సినిమా ఆఫర్లు వచ్చాయి. అయితే ఆమె తెలుగులో కంటే కన్నడలోనే ఎక్కువ సినిమాలు చేసి అక్కడ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. 

అలా కెరియర్ మంచి పొజిషన్ లో ఉండగానే 2014వ సంవత్సరంలో సినిమా ఫీల్డ్ కు గుడ్ బై చెప్పి  మళ్లీ కనిపించకుండా పోయింది. అయితే ఆమె సడన్గా ఆలీతో సరదాగా షోలో ప్రత్యక్షమై తన జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి పంచుకుంది.. అయితే ఈ సమయంలో ఆమెను చూసిన చాలా మంది గుర్తుపట్టలేకపోయారు. పూర్తిగా బక్క చిక్కిపోయి ఉంది.. ఇక తాజాగా మరో ఇంటర్వ్యూలో రేఖా వేదవ్యాస్ మాట్లాడుతూ.. నేను అనారోగ్య పరిస్థితుల వల్ల సినిమాల నుంచి సడన్ గా దూరమయ్యాను. హాస్పిటల్ ల చుట్టూ తిరిగాను.. మానసికంగా శారీరకంగా ఎంతో  కృంగిపోయాను. పెళ్లి విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడి పెళ్లి అనే మాటకు దూరమైపోయాను.

ఇలా కొన్నాళ్లపాటు నా కెరియర్ చాలా దారుణమైన పరిస్థితులకి వెళ్లిపోయింది . ఇక హాస్పిటల్ లో అయ్యే ఖర్చులు భరించాలంటే నావల్ల కాలేదు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా.. మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నానని  అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు సరైన వ్యక్తి దొరికితే వివాహ బంధంలోకి కూడా అడుగు పెట్టాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది..ఇప్పటి జనరేషన్ లో పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకునే వారు ఎక్కువైపోయారు.అలా కాకుండా పెళ్లి చేసుకుంటే జీవితకాలం బంధం కొనసాగేలా ఉండాలని రేఖ వేదవ్యాస్ తెలియజేసింది.. ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: