
అయితే ఇండియన్ సినిమాల్లో అత్యంత ప్రేక్షకాదరణ కలిగి ఉన్న బాహుబలి మరియు స్క్విడ్ గేమ్ కలిపి చూస్తే ఎలా ఉంటుంది..? అబ్బో ఈ ఐడియానే నెక్స్ట్ లెవల్. తాజాగా ఓ నెటిజన్ ఈ ఐడియాను ఇంప్లిమెంట్ చేసేశాడు. `బాహుబలి ఇన్ స్క్విడ్ గేమ్` పేరిట సినిమా మరియు వెబ్ సిరీస్‌లను కలిపి క్రాస్ ఓవర్ వీడియోను రూపొందించాడు. ప్రభాస్, రానా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ ఇలా బాహుబలిలోని పలువరు ఆర్టిస్టులను స్క్విడ్ గేమ్‌లో భాగం చేశారు.
బాహుబలిలోని నటీనటులు స్క్విడ్‌గేమ్ ఆడితే ఎలా ఉంటుందో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ క్రాస్ ఓవర్ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా బాబు అంటూ తెగ నవ్వుకుంటున్నారు. ఇదెక్కడి మాస్ క్రాస్ ఓవర్ రా మావా అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. బాహుబలి రేంజ్ ఎడిటింగ్, పర్ఫెక్షన్ పీక్స్ అని మరొకరు కామెంట్ పెట్టారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు