ఇప్పటివరకు ఈ సంవత్సరం హైయెస్ట్ కలెక్షన్లను మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా సాధించిన టాప్ 10 ఇండియన్ మూవీస్ ఏవి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ హీరోయిన్గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చెంజర్ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 92.25 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నీది అగర్వాల్ హీరోయిన్గా రూపొందిన హరిహర వీరమల్లు సినిమా మొదటి రోజు 70 కోట్ల కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది. మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకమారన్ దర్శకత్వంలో రూపొందిన  ఎంపురాన్ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 67.35 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. బాలకృష్ణ హీరోగా బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ సినిమా మొదటి రోజు 51.85 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. అజిత్ కుమార్ హీరో గా రూపొందిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా మొదటి రోజు 51.50 కోట్ల కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. చావా మూవీ మొదటి రోజు 47.55 కోట్ల కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. అజిత్ కుమార్ హీరో గా రూపొందిన విడ ముయర్చి సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 48.45 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.  సల్మాన్ ఖాన్ హీరో గా రష్మిక మందన హీరోయిన్గా రూపొందిన సికిందర్ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 41.60 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. నాని హీరో గా శ్రీ నిధి శెట్టి హీరోయిన్గా శైలేష్ కొలను  దర్శకత్వంలో రూపొందిన హిట్ 3 మూవీ మొదటి రోజు 40.8 కోట్ల కలెక్షన్లను వసులు చేసింది. విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మొదటి రోజు 40.5 కోట్ల కలెక్షన్లను  వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: