
ఈ సినిమాలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు . మరి ముఖ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్ పై డబుల్ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు అభిమానులు. దానికి కారణం ఆల్రెడీ హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీనే. ఈ సినిమా ఎన్ని సార్లు చూసిన తనివి తీరదు . ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది . పవన్ కళ్యాణ్ ని ఎలా అయితే పవన్ అభిమానులు చూడాలి అనుకున్నారో అలా చూపించి పవన్ అభిమానులు ఆకలి తీర్చేసాడు హరీష్ శంకర్.
మళ్లీ ఇన్నాళ్లకు వీళ్ళ కాంబో సెట్ అవ్వడంతో ఈ కాంబోలో రాబోతున్న సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు . తాజాగా "ఉస్తాద్ భగత్ సింగ్" నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ షూటింగ్ క్రేజీ క్లైమాక్స్ ఎపిసోడ్ పవన్ పై రూపొందించినట్లు..పలు సీన్లతో కంప్లీట్ అయినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా వెల్లడించారు మేకర్స్. దానికి సంబంధించిన పిక్చర్ కూడా పోస్ట్ చేశారు . సోషల్ మీడియాలో ఈ పిక్చర్ బాగా వైరల్ మారింది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ని మనం "ఖుషి" సినిమాలోని లుక్స్ లో చూడబోతున్నాం అంటూ ఈ పోస్ట్ ద్వారా అర్థమయిపోతుంది. కళ్ళకు అద్దాలు పెట్టుకొని .. రెడ్ కలర్ షర్ట్ లో.. హరీష్ శంకర్ సీన్ వివరిస్తూ ఉండగా పవన్ కళ్యాణ్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా వింటున్న పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . చాలామంది ఈ పిక్చర్ ని ట్రెండ్ చేస్తున్నారు . నాటి పవన్ కళ్యాణ్ ని మళ్ళీ మనం తెరపై చూడబోతున్నామంటూ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు..!