- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ )

ఈ ఇండిపెండెన్స్ డే వీకెండ్‌కి ఇండియన్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రెండు పాన్‌ ఇండియా భారీ చిత్రాల మధ్య జరగబోయే మాస్ క్లాష్‌ను ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న కూలీ, హిందీ ఇండస్ట్రీ నుంచి వచ్చే వార్-2 ఇవే ఆ క్రేజీ సినిమాలు. ఇప్పటికే ఈ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ కాంబినేషన్, స్టైల్, స్కేల్ రెండు సినిమాల‌కు ఉన్నా ప్రస్తుతం హైప్ పరంగా చూస్తే కూలీ స్పష్టంగా ముందంజలో ఉంది. కూలీకు కారణం హీరో క్రేజ్ మాత్రమే కాదు, అందులోని కాంబినేషన్ కూడా. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఇక కూలీ టీజర్, ట్రైలర్‌లు ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. మాస్ యాక్షన్, స్టైలిష్ ఫైట్స్, కథలో కొత్త‌ద‌నం కూలీపై భారీ హైప్‌కు కార‌ణ‌మ‌య్యాయి.


ఇప్పటికే యూఎస్ మార్కెట్‌లో ఈ సినిమాకు ఊహించని స్పందన లభిస్తోంది. విడుదలకు ఇంకా మూడు వారాల టైం ఉండగానే, కూలీ హాఫ్ మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది పాన్ ఇండియన్ మూవీగా ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌కు నిదర్శనం. ఫ‌స్ట్ వీకెండ్ లోపే మిలియన్ డాలర్ మార్క్ దాటడం ఖాయమని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. బుకింగ్స్ మొదలైనప్పటి నుంచీ టికెట్లు శరవేగంగా అమ్ముడవుతున్నాయి. ఈ పేస్ కొనసాగితే విడుదల రోజు భారీ వసూళ్లు ఖాయం.


వార్-2 విషయానికొస్తే.. హృతిక్ రోషన్ఎన్టీఆర్ కాంబినేషన్, యశ్ రాజ్ ఫిల్మ్స్ యాక్షన్ యూనివర్స్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా మంచి అంచనాలు కలిగి ఉన్నా, ప్రస్తుతం యూఎస్ మార్కెట్‌లో అంత స్పీడ్ లేదు. కేవలం పరిమిత స్క్రీన్లలో మాత్రమే ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. టికెట్లు నెమ్మదిగా అమ్ముడవుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం, బుకింగ్స్ సుమారు 5 వేల డాలర్ల వరకు మాత్రమే నమోదయ్యాయి. బుకింగ్స్ పూర్తిగా ఓపెన్ అయిన తర్వాత పరిస్థితి మారవచ్చు.  ప్రస్తుతానికి మాత్రం కూలీ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: