
కొన్నిసార్లు హీరో ఆ ఈవెంట్ కి రాకుండా మిస్ చేయొచ్చు .. హీరోయిన్ , డైరెక్టర్ , ప్రముఖులు ఆ ఈవెంట్ ని మిస్ చేసుకోవచ్చు.. కానీ సుమ మాత్రం మిస్ చేసుకోదు. ఈరోజు ఒక బడా స్టార్ హీరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే సాయంత్రమే మరొక స్టార్ హీరో కి సంబంధించిన ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఉంటుంది . అంత బిజీ షెడ్యూల్లో ముందుకు వెళుతూ ఉంటుంది యాంకర్ సుమ. అయితే సుమ నెల సంపాదన ఎంత..? ఒక షోకి ఎంత తీసుకుంటుంది..? అనే సందేహం ఎప్పుడూ అందరికీ ఉంటుంది .
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం యాంకర్ సుమ ఒక షో చేస్తే 50,000 తీసుకుంటుందట . కేవలం ఆ ఒక్క ఎపిసోడ్ కి మాత్రమే . ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఆ హీరోకి తగ్గట్టు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట . మామూలు స్టార్ హీరో అయితే లక్ష..బడా పాన్ ఇండియా స్టార్ హీరో అయితే రెండు లక్షలు , మూడు లక్షలు ఒక్కొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సమయానుసారం ఐదు లక్షల కూడా ఛార్జ్ చేస్తుందట . రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం అసలు తగ్గదట . అది ఎవ్వరైనా సరే ఎంత పెద్ద స్టార్ ప్రొడక్షన్ హౌస్ అయినా సరే ఆ కారణంగానే సుమ అన్ని ఆస్తుపాసులు సంపాదించుకుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!