సినీ నటుడు సోనూసూద్ పేరు  ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. సినిమాలలో విలన్ పాత్రలలో కనిపించినప్పటికీ.. నిజజీవితంలో మాత్రం గొప్ప మనసుతో ఎంతోమందికి సహాయం చేశారు. దేశంలో కరోనా సమయంలో కూడా ఏ కష్టం వచ్చినా ఎవరు సహాయమడిగినా కూడా వెంటనే స్పందించి రియల్ హీరోగా పేరు సంపాదించారు. నిన్నటి రోజున తన 52వ పుట్టినరోజు కావడం చేత ఒక గొప్ప నిర్ణయానికి శ్రీకారం చుట్టారు సోనూసూద్. అదేమిటంటే వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.

500 మంది వృద్ధులకు ఇందులో ఆశ్రమం కల్పించబోతున్నట్లుగా తెలియజేశారు సోనూసూద్. ఎవరూ లేని అనాధలుగా ఉన్న వృద్ధులకు ఇది చాలా సురక్షితమైన ఇల్లు లా ఉంటుందని, ఇక్కడ ప్రేమతో కూడిన వాతావరణాన్ని సృష్టించేందుకే ప్రయత్నిస్తామంటూ తెలిపారు. వారికి కేవలం ఆశ్రమమే కాకుండా వైద్య సంరక్షణ, పోషక ఆహారం కూడా అందిస్తామంటూ తెలియజేశారు. వృద్ధాప్యంలో వారికి కావలసిన ఎమోషనల్ సపోర్టు కూడా ఉంటుంది అంటూ.. అందుకు తగ్గట్టుగానే వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు సోనూసూద్ .. అయితే ఈ విషయం విన్న అభిమానులు.. సోనూసూద్ పై  మరొకసారి ప్రశంసలు కురిపిస్తూ రియల్ హీరో అంటూ ప్రశంసిస్తున్నారు.

సోనూ ఇలా గొప్ప మనసు చాటడం ఇదేమి మొదటిసారి కాదు.. కరోనా సమయంలో తరచూ ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో చేస్తూనే వచ్చారు. లాక్డౌన్ సమయంలో వలస కూలీలను తన సొంత ఖర్చులతో తమ ఇళ్లకు పంపించడమే కాకుండా.. ఎంతోమందికి భోజనాలు పెట్టించి వారి కడుపు నింపారు. సోషల్ మీడియా ద్వారా సహాయం కావాలి,  ఉద్యోగం కావాలి అని అడిగిన వారందరికీ కూడా ఏదో ఒక రూపంలో సహాయం చేసి రియల్ హీరోగా పేరు సంపాదించారు. సోనూసూద్ చేపట్టిన సామాజిక సేవలకు గాను మిస్ వరల్డ్ 2025 ఫైనాన్స్ వేడుకలలో కూడా అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం ఈ విషయమైతే వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: