
ట్రైలర్ సినిమా కథనాన్ని పెద్దగా రివీల్ చేయకుండానే సినిమాపై అంచనాలను పెంచింది. అయితే ట్రైలర్ మరీ కొత్తగా అయితే లేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కూలీ ట్రైలర్ విషయానికి వస్తే రజినీకాంత్ స్టైల్, మాస్ అప్పీల్, డైలాగ్స్, లోకేష్ కనగరాజ్ మార్క్ ట్రైలర్ కు ప్లస్ అయ్యాయి. రజినీకాంత్ వింటేజ్ లుక్, యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.
అయితే ట్రైలర్ అంచనాలను అందుకోలేకపోయిందని, "వావ్" మొమెంట్స్ లేవని కొందరు అభిప్రాయపడుతున్నారు. రెగ్యులర్ గా ఉందని, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరింత బాగుండాల్సిందని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాలోని కంటెంట్‌ను లోకేష్ కావాలనే రివీల్ చేయలేదని మరికొందరు అంటున్నారు. ప్రస్తుతానికి 'వార్ 2' ట్రైలర్ ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకుందని, పాజిటివ్ టాక్ తెచ్చుకుందని చెప్పవచ్చు.
టెక్నికల్ బ్రిలియన్స్, హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ లు ఈ ట్రైలర్ కు ప్లస్ అయ్యాయి. అయితే, సౌత్ ఇండియాలో 'కూలీ'కి ఇంకా చాలా హైప్ మరియు ఫ్యాన్ సపోర్ట్ ఉంది. 'కూలీ' ట్రైలర్ అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ, రజినీకాంత్ క్రేజ్ వల్ల సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఆగస్టు 14న విడుదల కానున్నాయి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు