
బాలీవుడ్ ఇండస్ట్రీలో నెగిటివ్ షేడ్స్ లో కనిపించడం అంటే మామూలు మ్యాటర్ కాదు . అయితే జూనియర్ ఎన్టీఆర్ అలాంటి ఓ బిగ్ రిస్క్ చేసి నటన పట్ల తనకున్న ఇంట్రెస్ట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. కాగా ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ అప్డేట్స్ అన్ని కూడా సినిమాపై భారీ అంచనాలు పెంచాయి . కానీ హృతిక్ రోషన్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ కొంచెం తక్కువ పాత్రలో కనిపించబోతున్నాడేమో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి . సినిమా రిలీజ్ అయ్యాక దానికి క్లారిటీ వచ్చేస్తుంది .
అయితే ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి . తాజాగా బాలీవుడ్ మీడియాలో దీనిపై ఒక క్లారిటీ వచ్చింది . జూనియర్ ఎన్టీఆర్ ఈ వార్ 2 సినిమా కోసం అంత హై రెమ్యూనరేషన్ తీసుకోలేదట . కేవలం ఇది పుకారు గానే వినిపిస్తుంది . జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం 60 కోట్లు ఛార్జ్ చేశారట . అది కూడా మేకర్స్ మార్కెట్ బట్టి డిసైడ్ చేశారట. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది. హృతిక్ రోషన్ మాత్రమే సినిమా కోసం 100 కోట్లు తీసుకున్నారట . సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వార్ 2 సినిమాకి సంబంధించిన న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!!