ఇండియా వ్యాప్తంగా భారీ క్రేజ్ కలిగిన వార్ 2 , కూలీ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ఒకే రోజు భారీ ఎత్తున విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా ఆగస్టు 14 వ తేదీన విడుదల కానున్నాయి. ఈ సినిమాల విడుదల తేదీలు దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీలకు సంబంధించిన అనేక ప్రమోషనల్ కంటెంట్ ను మేకర్స్ విడుదల చేశారు. వాటికి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఈ రెండు సినిమాలపై కూడా హైప్ భారీగా పెరిగిపోయింది. దానితో ఈ రెండు సినిమాలలో ఏ సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేస్తుంది.

సినిమా మొదటి స్థానంలో నిలుస్తుంది అనే ఆసక్తి జనాల్లో భారీగా పెరిగిపోయింది. ఇప్పటివరకు ఓ విషయంలో మాత్రం వార్ 2 మూవీ పై కూలీ భారీ స్థాయిలో పై చేయి సాధించింది. అది ఎందులో అనుకుంటున్నారా ..? అడ్వాన్స్ బుకింగ్ విషయంలో. ఇప్పటివరకు వార్ 2 మరియు కూలీ ఈ రెండు సినిమాలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ చాలా ప్రాంతాలలో ఓపెన్ అయ్యాయి. అందులో భాగంగా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా వార్ 2 మూవీ కి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 8 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక కూలీ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్ లతో ఏకంగా 58 కోట్ల రేంజ్ లో కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఇలా ఇప్పటివరకు అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో వార్ 2 మూవీ పై కూలీ సినిమా భారీ స్థాయిలో పై చేయి సాధించినట్లు దీని ద్వారా క్లియర్గా అర్థం అవుతుంది. మరి టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ రెండు సినిమాలలో ఏ సినిమా ఎక్కువ కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి. వార్ 2 మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ హీరోలుగా నటించగా ... కూలీ మూవీ లో సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరో గా నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: