
ఈ సినిమాకి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో , గ్లింప్స్ లాంటిది వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనేది ఫ్యాన్స్ అభిప్రాయం . కానీ రాజమౌళితో అలాంటివన్నీ కుదరవు. రాజమౌళి ఎప్పుడు వీడియో రిలీజ్ చేస్తే అప్పుడు అది పండుగ . అలాంటి ఒక లెక్కతో ముందుకు వెళ్తాడు జక్కన్న . అయితే ఇప్పుడు రాజమౌళి సినిమా కంప్లీట్ అయిన తర్వాత మహేష్ బాబు ఏ ఈ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తాడు ..? అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ . ఎందుకంటే రాజమౌళితో సినిమా నటించిన తర్వాత ఆ హీరో వేరే ఏ డైరెక్టర్ తో చేసిన నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అయిపోతుంది . ఇప్పటివరకు చరిత్ర అలానే చెప్తుంది . రవితేజ, జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ . ప్రభాస్ లాంటి స్టార్స్ డిజాస్టర్స్ తమ ఖాతాలో వేసుకున్నారు .
ఇక ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసే విధంగా మహేష్ బాబు రాజమౌళితో సినిమా షూట్ కంప్లీట్ అయ్యాక ..ఎస్ ఎస్ ఎం బి 30 సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ తో ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది . ఆయన మరెవరో కాదు సందీప్ రెడ్డివంగా. ఆల్రెడీ సందీప్ రెడ్డివంగా ..అర్జున్ రెడ్డి కథను అదేవిధంగా యానిమల్ కథను ముందుగా మహేష్ బాబు కి వివరించారు . ఆయనతో సినిమా తెరకెక్కించాలి అని ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు . కానీ కుదరలేదు అయితే కేవలం మహేష్ బాబు కోసమే ఒక స్క్రిప్ట్ రాసుకున్నారట . దానికి "డెవిల్" అనే నామకరణం కూడా చేశారట . ఆయన ఒప్పుకుంటే ఆ సినిమాను ఆయనతో తెరకెక్కిస్తాను లేదంటే లేదు అని చాలా సందర్భాలలో పరోక్షంగానే బయట పెట్టాడు సందీప్ రెడ్డివంగా. అయితే ఈ సినిమానే ఆయన ఫైనలైజ్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది . ఎస్ ఎస్ ఎం బి 30 సినిమాను సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేయబోతున్నాడు అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతుంది. మహేష్ బాబు లాంటి సాఫ్ట్ హీరో సందీప్ రెడ్డి లాంటి డేరింగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తాడు అని అసలు ఎవరు కలలో కూడా ఊహించలేకపోయారు . ఫైనల్లీ ఛాన్స్ ఇచ్చాడు . మరి ఏ మాత్రం సందీప్ రెడ్డివంగ ప్రూవ్ చేసుకుంటాడో వేచి చూడాలి..!??