
టాలెంటెడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ పాత్రలో నటించిన ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను చక చక కంప్లీట్ చేసేస్తున్నారు మూవీ మేకర్స్ . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ సూపర్ సక్సెస్ అయ్యింది. అభిమానులు ఫుల్ ఖుషి ..అభిమానుల ఆనందం చూసి జూనియర్ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కూడా ఫుల్ ఖుషి .
అయితే ఈవెంట్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ . ఆయన మైక్ తీసుకొని మాట్లాడటం మొదలు పెట్టినప్పటి నుంచి ఫ్యాన్స్ అరుపులు కేకలతో హంగామ చేశారు. ఈ క్రమంలోనే స్పీచ్ ఇవ్వడానికి స్టేజి పైకి ఎక్కి మాట్లాడుతున్న ఎన్టీఆర్ కి ఓ అభిమాని కోపం తెప్పించాడు. జూనియర్ ఎన్టీఆర్ ముందే చెప్పాడు . మీరు అరవకుండా సైలెంట్ గా ఉంటే నేను మాట్లాడతాను అని. కానీ కొందరు మాత్రం ఎన్టీఆర్ ని విసిగిస్తూ అక్కడ పెద్దపెద్దగా అరిచారు. దీంతో స్పీచ్ డిస్టర్బ్ అయింది .
ఎన్టీఆర్ కి కోపం వచ్చింది. "ఇలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను.. సెకండ్ పట్టదు నాకు మైక్ ఇచ్చేసి వెళ్లిపోవడానికి ..ఆగండి ..తట్టుకోండి ..మీ కోసమేగా మాట్లాడుతున్నాను.. అంత దూరం నుంచి వచ్చారు నేను మాట్లాడితే చూడాలిగా.. ఆగండి "అంటూ కొంచెం కోపంగా మాట్లాడారు . అయితే ఇది కొంతమంది జనాలకి నచ్చలేదు. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్టేజ్ ఎక్కాక అంత ఓవర్ గా బిహేవ్ చేశాడు అంటూ మాట్లాడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కి బాలీవుడ్ ఇండస్ట్రీ వెళ్ళాక ఏదో అయింది . హెడ్వైట్ గా మాట్లాడుతున్నాడు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 కోసం అంత బాగా కష్టపడ్డాడు కానీ లాస్ట్ మినిట్ లో కొంచెం కోపంగా మాట్లాడి మొత్తం గజిబిజి గందరగోళం చేసుకుంటున్నారు అనే నందమూరి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఒక్క మాట ఆ ఒక్క మాట కానీ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడకుండా ఉండి ఉంటే వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంకా హైలైట్ గా మారుండేది అంటున్నారు జనాలు..!!