సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన ఎంతో మంది హీరోయిన్లు కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా అనేక బిజినెస్ లలోకి కూడా ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే మన టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న ఎంతో మంది బ్యూటీలు అనేక రకాలైన వ్యాపారాలలోకి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన రీతిలో సక్సెస్ అయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన ఓ నటీమని తాజాగా వాటర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈమె అమ్మే వాటర్ ధర చాలా ఖరీదుగా ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఓ ముద్దుగుమ్మ అమ్ముకుంటున్నా 500 ml నీళ్ల ధర ఎంతో తెలుసా ..? ఆ నీళ్ల 500 ml ధర ఏకంగా 150 రూపాయలు. 750 ml నీళ్ల ధర 200 రూపాయలు. మరి ఎందుకు ఈ నీళ్లకు అంత ఖరీదు అనుకుంటున్నారా ..? ఈ నీళ్లు ఎంతో స్వచ్ఛమైనవి అని , ఈ నీళ్లు తాగినట్లు అయితే వయసు ఏర్పడకుండా ఉంటుంది అనే తెలుస్తోంది. దానితో ఈ నీళ్ల ఖరీదు అత్యంత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నీళ్ల బిజినెస్ గనుక మంచి స్థాయిలో సక్సెస్ అయితే ఈమె కోట్లల్లో సంపాదించడం ఖాయం అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. 

ఇంతకు వాటర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు ... బాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన స్టార్ బ్యూటీలలో ఒకరు అయినటువంటి భూమి పడ్నేకర్. ప్రస్తుతం సినిమాలతో బిజీగా కెరియర్ను కొనసాగిస్తున్న భూమి పడ్నేకర్ తన సోదరి అయినటువంటి సమీక్షా పడ్నేకర్ తో కలిసి బ్యాక్‌బే ఆక్వా అనే పేరుతో వాటర్‌ బ్రాండ్‌ కంపెనీని తాజాగా స్థాపించింది. తాజాగా ఈ బ్యూటీ ఈ వాటర్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలను వివరిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టింది. ఇలా తాజాగా భూమి పడ్నేకర్ వాటర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: