
ఇక "ఇదే వేరే వాళ్లు చేస్తే, వాళ్ల వెనకాలే మాట్లాడతారు. కానీ హీరోయిన్స్ విషయానికి వస్తే వెంటనే యాటిట్యూడ్ అంటారు" అని ఆమె స్పష్టంగా చెప్పింది. సినిమా అనేది సమిష్టి కృషి అని తెలిసినా, కొన్నిసార్లు ఇలా అనవసరంగా వేచి ఉండాల్సి రావడం సాధారణం అని కొందరు అంటారు. కానీ ప్రతిసారీ ఇలా జరిగితే మాత్రం అసహనం రావడం సహజమే. అనుపమ లాంటి ఓపెన్ టాక్ చేసే వాళ్లు తక్కువే. ఆమె ఈ పాయింట్ చాలా మంది హీరోయిన్స్ ఫీలయ్యే విషయమే అని ఫిలింనగర్‌లో టాక్. ఈ మధ్య టాలీవుడ్‌లో హీరోయిన్స్‌కు డైరెక్ట్‌గా ఇబ్బందులు పెట్టకపోయినా, ఇన్‌డైరెక్ట్‌గా టైమ్ వేస్ట్ చేయించే సీన్ కామన్ అని చెబుతున్నారు.
కానీ ఇలాంటి పరిస్థితులు మారకపోతే, రాబోయే రోజుల్లో హీరోయిన్ లు డైరెక్ట్ ఎటాక్ కి కూడా వెళ్ళే అవకాశం ఉందని గుసగుస. ప్రస్తుతం అనుపమ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన పరదాతో ఆగస్ట్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో సంగీత, దర్శన రాజేంద్రన్ కీలక పాత్రల్లో నటించగా, అనుపమ లీడ్ రోల్‌లో కనిపించనుంది. ఈ సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో అమ్మడు ప్రమోషన్స్‌లో ఫుల్ స్పీడ్‌లో ఉంది. అనుపమ మాటలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవ్వడంతో, పరదాకి అదనపు పబ్లిసిటీ వచ్చేసింది. మరి సినిమా సక్సెస్ అవుతుందా? లేక ఈ వివాదమే ఎక్కువ హైలైట్ అవుతుందా? అన్నది 22న తేలనుంది.