
సీనియర్ హీరో జగపతిబాబు ఇప్పుడు కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వెండితెరపై తన నటనతో ఎన్నో రకాల పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించిన ఆయన, ఇప్పుడు ఓ టాక్ షో హోస్ట్‌గా మెప్పించడానికి రెడీ అవుతున్నారు. సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల సరదా, హాస్యభరితమైన ముచ్చట్లతో ప్రేక్షకులను అలరించే ఈ షో ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ షో తొలి ఎపిసోడ్‌కే కింగ్ నాగార్జునను గెస్ట్‌గా ఆహ్వానించడం హైలైట్‌గా మారింది.
ప్రోమోలో చూపినట్లుగా, జగపతిబాబు మరియు నాగార్జున మధ్య జరిగిన సరదా సంభాషణలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. జగపతిబాబు హోస్ట్‌గా నాగార్జునను ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడుగుతారు. మీకు బెస్ట్ కో-యాక్ట్రెస్ ఎవరు? రమ్యకృష్ణా లేక టబూ ? అడగగా.. ఈ ప్రశ్న విన్న నాగార్జున చిరునవ్వు చిందిస్తూ కొన్ని చెప్పకూడదు… నేను చెప్పను అంటూ చమత్కారంగా సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం నవ్వులు పూయించింది.
నాగార్జున కూడా రివర్స్‌లో జగపతిబాబుకు ఒక ప్రశ్న విసిరారు. "రమ్యకృష్ణ, సౌందర్యలో నీ ఫేవరెట్ ఎవరు?" అని అడిగారు. ఈ ప్రశ్న విన్న జగపతిబాబు వెంటనే, "ఇది నా ఇంటర్వ్యూ కాదు… నేను ఆన్సర్ చెప్పను" అంటూ నవ్వుతూ తప్పించుకున్నారు. ఇద్దరి మధ్య ఈ సరదా జోకులు, చమత్కారాలు చూసి ప్రేక్షకులు ఈ షో ఎంత ఎంటర్టైనింగ్‌గా ఉండబోతుందో అంచనా వేస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు