
“ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా స్టైలిష్ స్టార్ అనగానే బన్నీ పేరు చెబుతారు. ఇది అందరికి తెలుసు. మరి సాయి ధరమ్ తేజ్ ఎందుకు అలా అన్నాడు?” అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ వేడి చల్లారకముందే మరో వివాదంలో సాయి ధరమ్ తేజ్ ఇరుక్కున్నాడు. పుష్ప పాట ప్లే అవుతుండగా అక్కడ అందరూ ఉత్సాహంగా డాన్స్ చేస్తుండగా, అప్పటివరకు చలాకిగా ఉన్న సాయి ధరమ్ తేజ్ మాత్రం ఆ పాట రాగానే మౌనంగా ఉండిపోయాడు. దీనితో “అల్లు అర్జున్ అంటే ఆయనకి ఇష్టం లేదు, అందుకే ఆ పాటకు డాన్స్ చేయలేదు” అని కొందరు మాట్లాడుకుంటున్నారు.
ఇంతటితో ఆగకుండా, కొంతమంది ఫ్యాన్స్ “సాయి ధరమ్ తేజ్ సినిమాలను బహిష్కరించాలి” అని అంటుంటే, మరికొందరు “అల్లు అర్జున్ గురించి మాట్లాడే స్థాయి కూడా ఆయనకు లేదు” అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. మరోవైపు, “అల్లు అర్జున్ రేంజ్ చూసి మెగా హీరోలు అసూయపడుతున్నారని, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు” అని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడిప్పుడే చల్లారుతున్న వార్ ని మరీంత హీట్ పెంచేశాడు సాయి ధరమ్ తెజ్. ఇప్పుడు ఈ ఫ్యాన్స్ దీని ని ఎంత పెద్ద రాధాంతం చేస్తారో..???