టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్ లో రామ్ చ‌ర‌ణ్ - ఉపాస‌న జంట ఒక‌టి. చ‌ర‌ణ్ హీరోగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌తో దూసుకుపోతుండ‌గా.. మ‌రోవైపు ఉపాస‌న ఫ్యామిలీని చూసుకుంటేనే వ్యాపార‌రంగంలో రాణిస్తోంది. ప్ర‌స్తుతం అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌లో సీఎస్‌ఆర్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. సేవా కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటోంది. ఇటీవలే తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌‌కు కో ఛైర్మన్‌ గా కూడా నియమితురాలైన ఉపాస‌న తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇంట‌ర్వ్యూలో ఇచ్చింది.


ఈ సంద‌ర్భంగా ప్రొఫెషనల్ అండ్ ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కు సంబంధించి ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంది. రామ్ చ‌ర‌ణ్ తో రిలేష‌న్‌లో ఉన్న టైమ్‌లో అతనికి ఒక ల‌వ్ టెస్ట్ పెట్టాన‌ని ఉపాస‌న చెప్పుకొచ్చింది. నిజంగా త‌న‌ను ప్రేమిస్తే ఛార్మినార్ దగ్గర ఉన్న ఫేమస్ ఐస్ క్రీమ్ స్పాట్‌కు తీసుకెళ్లాలని చెప్పాన‌ని, నిజంగానే తీసుకెళ్లి ప‌రీక్ష పాస్ అయ్యాడ‌ని.. కాక‌పోతే అక్క‌డ అంద‌రు చ‌ర‌ణ్‌ని గుర్తు ప‌ట్టి మీద ప‌డిపోయార‌ని ఉపాస‌న తెలిపింది.


అలాగే త‌న మొబైల్ లో చ‌ర‌ణ్ నెంబ‌ర్ ను ఏ పేరుతో సేవ్ చేసుకుందో కూడా ఉపాస‌న వెల్ల‌డించింది. `రామ్ చ‌ర‌ణ్ 200` అనే పేరుతో భ‌ర్త నెంబ‌ర్ ను సేవ్ చేసుకున్నాన‌ని ఇంట‌ర్వ్యూలో ఉపాస‌న తెలిసింది. సాధార‌ణంగా సెల‌బ్రిటీలు ఏదో ఒక కార‌ణంతో త‌ర‌చూ త‌మ మొబైల్ నెంబ‌ర్‌ను మారుస్తూ ఉంటారు. అయితే అలా ఇప్ప‌టి వ‌ర‌కు రామ్ చ‌ర‌ణ్ ఏకంగా 199 సార్లు మొబైల్ నెంబ‌ర్ ను ఛేంజ్ చేశాడు. ప్ర‌స్తుతం అత‌ను 200వ నెంబ‌ర్‌ను యూస్ చేస్తున్నాడ‌ట‌. అందుకే రామ్ చ‌ర‌ణ్ 200 అనే పేరుతో నెంబ‌ర్ సేవ్ చేసుకున్నాన‌ని ఉపాస‌న పేర్కొంది. దీంతో చ‌ర‌ణ్ అన్నిసార్లు నెంబ‌ర్ ఛేంజ్ చేశాడా అంటూ నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యంతో న‌వ్వుకుంటున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: