
తాజాగా ముంబైలో జరిగిన ప్రెస్ మీట్లో నాగార్జున చేసిన వ్యాఖ్యలు ఆ పాత్ర ఎంత వయొలెంట్‌గా ఉందో చెబుతున్నాయి. “ఈ సినిమా నా పిల్లలు, మనవళ్లు చూడకూడదనుకుంటున్నాను” అని ఆయన నవ్వుతూ చెప్పిన మాట, ఆ పాత్రలోని క్రూరతను ఊహించేలా చేస్తోంది. నాగార్జున స్టైల్ యాక్టింగ్, లోకేష్ రైటింగ్ కలిసి ఈ విలన్ రోల్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్తాయనే నమ్మకం యూనిట్‌కి ఉంది.అయితే, నాగార్జున కెరీర్ గత కొన్నేళ్లుగా సరిగా సాగలేదు. వరుసగా ఫ్లాప్స్ ఎదురై, నా సామి రంగా తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న ఆయన ఇప్పటి వరకు సోలో హీరోగా కొత్త సినిమా ప్రకటించలేదు. కుబేర సినిమాలో ధనుష్‌తో కలిసి కనిపించి సక్సెస్ అందుకున్నా, ఫ్యాన్స్ మాత్రం ఆయనను మళ్లీ హీరోగా చూడాలని కోరుకుంటున్నారు.
కూలీలో ఆయన పవర్ఫుల్ విలన్‌గా కనిపించడం వలన, సినిమా హిట్ అయితే టాలీవుడ్ సహా పలు ఇండస్ట్రీల నుండి కనీసం పది మంది దర్శకులు నాగార్జునను విలన్ లేదా కీలకమైన పాత్ర కోసం సంప్రదించే అవకాశాలు ఉన్నాయి. ఇది కెరీర్‌కి కొత్త దారి కావొచ్చు కానీ, ఫ్యాన్స్ మాత్రం “మన హీరో మరికొన్నేళ్లు లీడ్ రోల్లోనే ఉండాలి” అంటున్నారు.ఇక, కూలీ రికార్డ్ బ్రేకింగ్ వసూళ్ల దిశగా దూసుకుపోతే, నాగార్జున ముందు తీసుకోబోయే నిర్ణయం—మళ్లీ హీరోగా మాస్ ఎంట్రీనా? లేక విలన్‌గా కొత్త జానర్ ప్రయాణమా?—అనేది రాబోయే రోజుల్లో హాట్ టాపిక్ కానుంది. ఇప్పటికీ, సినిమా రిలీజ్‌కి ముందు నుంచే “లోకేష్ నాగ్‌ను ఎలా మలిచాడా?” అన్న ఉత్కంఠ టాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు ఫుల్‌గా పెరిగిపోయింది.