వార్ 2 అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ బిగ్  ప్రాజెక్ట్. ఈ సినిమా నిన్న థియేటర్లలో రిలీజ్ అయి అభిమానులను బాగా ఆకట్టుకుంది. మధ్య మధ్యలో కొన్ని నెగిటివ్ టాక్ వినిపించినా, సినిమాకు 60%–80% పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్, హృతిక్ రోషన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. సాధారణంగా ఇద్దరు బడా హీరోలతో సినిమా తెరకెక్కించాలి అంటే, డైరెక్టర్ మీద ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. ఏ ఒక్క హీరోని హైలైట్ చేసి చూపిస్తే, మరొక హీరో అభిమానులు పూర్తిగా డిసప్పాయింట్ అవుతారు. అక్కడితో ఆగకుండా సోషల్ మీడియాలో ట్రోల్ చేసి, వారి నెక్స్ట్ సినిమాను అడ్డుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. కానీ వార్ 2 విషయంలో మాత్రం పూర్తిగా రివర్స్ అయింది. అయాన్ ముఖర్జీ ..హృతిక్ రోషన్‌ను ఎంత చక్కగా చూపించాడో, జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా అంతే చక్కగా చూపించాడు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


జూనియర్ ఎన్టీఆర్ రోల్ బాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఇంప్రెస్ చేసింది. ఎన్టీఆర్ డాన్స్, నటన, డైలాగ్ డెలివరీ .. ఇవన్నీ బాలీవుడ్ జనాలను బాగా ఆకట్టుకున్నాయి. అయితే అయాన్ ముఖర్జీ మొదట ఈ రోల్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను అస్సలు అనుకోలేదట. ఇది ఆదిత్య చోప్రా గారు చూసి ఆయనను రికమెండ్ చేశారట. కానీ ఈ రోల్‌కి ముందుగా ఒక తెలుగు హీరోను అనుకున్నారని సమాచారం. అయాన్ ముఖర్జీ అనుకున్న ఆ హీరో మరెవరో కాదు .. రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్‌కి ఆల్రెడీ బాలీవుడ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పైగా ప్రభాస్‌ పట్ల అయాన్ ముఖర్జీకి ఒక ప్రత్యేక గౌరవం, ఇష్టం ఉంది.

 

ముందే ప్రభాస్ అంటే ఆయనకు ఒక తెలియని ఇంట్రెస్ట్. ఆ కారణంగానే ఈ రోల్ లో ఆయనను చూపించాలని భావించారట. కానీ ప్రభాస్ ఈ ఆఫర్‌ను సున్నితంగా రిజెక్ట్ చేశారట. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అసలు నటించనని, ఈ విషయంలో తనకు ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారట. అందువల్ల ప్రభాస్ రిజెక్ట్ చేసిన వెంటనే, ఈ రోల్‌ను ఎవరు బాగా చేయగలరో ఆలోచించి, ఫైనల్లీ ఆ లక్కీ ఛాన్స్ జూనియర్ ఎన్టీఆర్‌కి దక్కింది. ప్రభాస్ ఈ పాత్ర రిజెక్ట్ చేయడం ఫ్యాన్స్ కి బిగ్ హ్యాపీ. ఈ పాత్రలో ఎన్టీఆర్ పూర్తిగా లీనమైపోయాడు. ఆయన పర్ఫార్మెన్స్ చూసిన ప్రతి ఒక్క అభిమానికి గూస్‌బంప్స్ వచ్చాయి. వార్ 2 తర్వాత, మరో బాలీవుడ్ సినిమాలో కూడా సోలో  రోల్‌లో నటించబోతున్నాడు తారక్ అనే న్యూస్ తెరపైకి వచ్చింది. ఇది ఎంతవరకు నిజమనేది తెలుసుకోవాలంటే, అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: