అప్పుడప్పుడు కొన్ని సినిమాలు అనుకోకుండా చిక్కుల్లో పడుతూ ఉంటాయి. దర్శక నిర్మాతలు అన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమాను తెరకెక్కించినప్పటికీ ఎక్కడో ఏదో ఒక చోట ఎవరైనా ఒకరిని కించపరిచినట్టు చూపించి లేదా తప్పుగా చూపించడం వల్ల వివాదంలో ఇరుక్కుంటారు. అలా తాజాగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటించిన పరమ్ సుందరి మూవీ కూడా అనూహ్యంగా వివాదంలో ఇరుక్కుంది. అది కూడా చర్చిలో పరమ చెత్త రొమాన్స్ చేస్తూ..ఇక విషయంలోకి వెళ్తే..సిద్ధార్థ్ మల్హోత్రా జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కిన తాజా మూవీ పరమ్ సుందరి.. తుషార్ జలోటా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఈ ఆగస్టు 29న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్లో ఢిల్లీకి చెందిన అబ్బాయి కేరళకి చెందిన అమ్మాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనేది చూపించారు.

అలాగే ఈ సినిమా లవ్ అండ్ కామెడీ జానర్ లో తెరకెక్కుతుంది. అయితే తాజాగా పరమ్ సుందరి మూవీ ట్రైలర్ లో చర్చ్ ని అపవిత్రం చేశారంటూ క్రిస్టియన్స్ మండి పడుతున్నారు. అయితే ఈ సినిమాలోని ట్రైలర్లో ఓ చోట చర్చిలో రొమాంటిక్ చేస్తున్నట్టు ఒక సీన్ చూపించారు. అయితే ఈ సీన్ పట్ల చాలామంది క్రిస్టియన్స్ మండిపడుతున్నారు. చర్చిలో రొమాన్స్ చేయడం ఏంటి..ప్రార్ధన చేసే పవిత్ర మందిరంలో ఇలాంటి రొమాన్స్ చేయడం సరికాదు.అసలు ఈ సినిమా లోని ఈ సన్నివేశాలను చర్చిలో తెరకెక్కించినందుకు దర్శకుడు నిర్మాత మీద ఖచ్చితంగా కేసు నమోదు చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు కొంత మంది క్రిస్టియన్స్.

 ముఖ్యంగా మహారాష్ట్ర గవర్నమెంట్ కి అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కి వాచ్ డాగ్ ఫౌండేషన్ వాళ్లు లెటర్ రాశారు. వెంటనే పరమ్ సుందరి మూవీ నుండి చర్చిలో చేసిన ఈ రొమాంటిక్ సీన్ ని తీసివేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ సీన్ తీసివేయకుండా సినిమా రిలీజ్ చేస్తే మాత్రం బాగుండదు అంటూ తమ లేఖలో పేర్కొన్నారు.అంతేకాదు నిర్మాతపై డైరెక్టర్ పై కేసు పెట్టాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేయడంతో పరమ్ సుందరి మూవీకి సంబంధించి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అనూహ్యంగా పరమ్ సుందరి మూవీ చిక్కుల్లో పడడంతో చాలామంది నెటిజన్స్ సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ ని ఏకిపారేస్తున్నారు. సిగ్గు లేదా చర్చిలో అలాంటి చెత్త పనేంటి అంటూ తిడుతున్నారు. కానీ ఇందులో జాన్వీ కపూర్ తప్పేమీ లేదు. సినిమా తీసింది డైరెక్టర్ కానీ ఇందులో జాన్వీ కపూర్ పై ట్రోల్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: