పాపం.. తాను ఒకటి తలిస్తే, దైవం మరొకటి తలచినట్లు. ఆయన ఎంతో కష్టపడి ఇష్టంగా తెరకెక్కించిన కూలీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ దక్కించుకుని, మంచి కలెక్షన్లు కూడా సాధిస్తోంది అనుకున్నాడు లోకేష్. కానీ ఆయన దర్శకత్వానికి మాత్రం నెగిటివ్ మార్కులు పడుతున్నాయి. ముఖ్యంగా, విక్రమ్ సినిమాలో చూపించినంత హై లెవెల్ సీన్స్ ఈ సినిమాలో చూపించలేకపోయాడు అన్న మాట ఎక్కువగా వినిపిస్తోంది. రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బిగ్ మూవీ "కూలీ" భారీ అంచనాల మధ్య ఆగస్టు 14న థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. పాజిటివ్ కామెంట్స్ ఎక్కువగానే ఉన్నప్పటికీ, వాటితో పాటు నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. రజనీకాంత్ నటన, మ్యూజిక్ చాలా బాగున్నాయని ప్రేక్షకులు చెప్పుకుంటున్నా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వం గురించి మాత్రం ఫుల్ నెగిటివ్‌గా మాట్లాడుతున్నారు. కొన్ని సీన్స్ మరీ పేలవంగా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు.


సినిమా కథలో, స్క్రీన్‌పై ఎమోషనల్ కంటెంట్ లోపించడం వల్ల లోకేష్ మార్క్ కనిపించలేదని కొందరు ఎద్దేవా చేస్తున్నారు.  కూలీ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్.. టాలీవుడ్ స్టార్ హీరోస్ ప్రభాస్, రామ్ చరణ్‌లతో సినిమాలకు కమిట్ అయ్యాడని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ మిస్ అయినట్లు తెలుస్తోంది. కూలీ సినిమాకు వచ్చిన టాక్ ప్రకారంగా, రామ్ చరణ్, ప్రభాస్ ఇద్దరూ ఆయనతో సినిమా చేయడానికి రిజెక్ట్ చేశారని ఓ వార్త టాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల కాలంలో తెలుగు హీరోలు–తమిళ దర్శకుల కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఎక్కువగా ఫ్లాప్ అవుతున్నాయి.

 

రామ్ చరణ్–శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన గేమ్ చేంజర్.  మహేష్ బాబు–మురగదాస్ కాంబోలో వచ్చిన స్పైడర్.  రామ్ పోతినేని–లింగుస్వామి కాంబినేషన్‌లో వచ్చిన ది వారియర్.  నాగచైతన్య–వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో వచ్చిన కస్టడీ ఇలా వరుసగా ఫ్లాప్ అవుతుండటంతో, ఇలాంటి రిస్క్ చేయడం అవసరం లేదని ప్రభాస్, రామ్ చరణ్ మనసు మార్చుకున్నట్లు సమాచారం. దాంతో, లోకేష్ కనగరాజ్ ఖాతాలో ఉన్న రెండు మంచి సినిమాలు వెళ్లిపోయినట్లైంది. ఇప్పుడు ఖైదీ 2లో తన సత్తా ఏంటో చూపిస్తాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ భవిష్యత్తు ఇప్పుడు పూర్తిగా ఖైదీ 2పైనే ఆధారపడి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: