
ఈసారి మల్లీశ్వరిని మించే మేజిక్ చూపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఏడు ఎనిమిది ఏళ్ల క్రితమే అనౌన్స్ అయినా, షూటింగ్ మొదలుకాకపోవడంతో మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత ఇద్దరూ తమ తమ కమిట్‌మెంట్‌లలో బిజీ అయ్యారు. ఇప్పుడు మాత్రం పరిస్థితులు కలిసివచ్చి, త్రివిక్రమ్ – వెంకీ కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్ పడింది. త్రివిక్రమ్, అల్లు అర్జున్‌తో చేయాల్సిన ఫాంటసీ మూవీ రద్దు కావడంతో, ఆయన జూనియర్ ఎన్టీఆర్‌తో ఒక భారీ ప్రాజెక్ట్‌ను లాక్ చేశారు. కానీ అది సెట్స్‌పైకి వెళ్లడానికి టైం పడుతుండటంతో, ఈలోగా వెంకటేష్ మూవీని త్వరగా పూర్తి చేసి, వచ్చే వేసవికల్లా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.
2025లో వెంకటేష్ రెండు భారీ సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నారు. చిరంజీవితో మెగా 157, అలాగే ఈ కొత్త త్రివిక్రమ్ మూవీ రెండూ అదే ఏడాదిలో ద్వితీయార్థంలో విడుదల కానున్నాయి. వీటికి అదనంగా వెంకీ మామ మరో ప్రాజెక్ట్‌కి ఇప్పటివరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇద్దరు కొత్త దర్శకులు కథలు చెప్పినప్పటికీ, ఇంకా ఫైనల్ నెరేషన్ జరగాల్సి ఉంది. సంక్రాంతి తర్వాత ‘స్లో అండ్ స్టడీ’ ఫార్ములా పాటిస్తున్న వెంకీ మామ, ఇప్పటికే ఆరు నెలలకు పైగా గ్యాప్ తీసుకున్నారు. వంద శాతం నచ్చితే తప్ప ఎవరికి ‘అవును’ చెప్పడం లేదని తెలిసింది. ఈ కొత్త సినిమా కోసం "వెంకటరమణ", "ఆనందరావు" వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. వెంకీ – త్రివిక్రమ్ కాంబినేషన్ మళ్లీ జెరగటం మాత్రమే అభిమానుల కోసం పండుగలాంటిది. ఇక ఈ మాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందో లేదో చూడాలి.