
విడుదలకు ముందు వరకు “కూలీ” బుకింగ్స్ పరంగా అదరగొట్టింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ చిత్రానికి అసాధారణ క్రేజ్ కనిపించింది. రజినీ కేరెక్టర్, ట్రైలర్‌లో చూపించిన మాస్ ఎలిమెంట్స్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. కానీ విడుదలైన తర్వాత మాత్రం “వార్ 2” దూసుకుపోయింది. యాక్షన్ సన్నివేశాలు, ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కెమిస్ట్రీ, అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన హాలీవుడ్ రేంజ్ విజువల్స్ వల్ల ఈ సినిమా పాన్ ఇండియా ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. రిలీజ్‌కు ముందు.. రిలీజ్ రోజు కూలీ డామినేట్ చేస్తే ఇప్పుడు వార్ 2 పై చేయి కనపడుతోంది.
బుక్ మై షో రికార్డుల ప్రకారం, గత 24 గంటల్లోనే “కూలీ”కు సుమారు 6 లక్షల 89 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. అయితే అదే సమయంలో “వార్ 2” మాత్రం ఏకంగా 7 లక్షల 45 వేల టికెట్లు సేల్స్ చేసింది. ఈ అంకెలు చూస్తే రెండో రోజు నుంచి “వార్ 2” డామినేట్ చేస్తోందని స్పష్టమవుతోంది. థియేటర్లలో కూడా రిపీట్ ఆడియెన్స్ “వార్ 2” వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని సమాచారం. ఇక మూడో రోజు కలెక్షన్లు ఎలా ఉంటాయనేది ఇప్పుడు హాట్ టాపిక్. వీకెండ్ మరియు హాలిడే సీజన్ కావడంతో రెండు సినిమాలు కూడా భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.