సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది.కి మంచి విజయాలు దక్కితేనే మంచి అవకాశాలు దక్కుతూ ఉంటాయి. కానీ మరి కొంత మంది కి మాత్రం వరుస పెట్టి అపజయాలు దక్కిన కూడా వరుస పెట్టి సినిమాలలో అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అలా ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించిన తక్కువ సినిమాలతో విజయాలను అందుకున్న ఓ నటికి మాత్రం వరుస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. ఇంతకు ఆ నటి ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు అనన్య నాగళ్ళ. ఈ ముద్దుగుమ్మ ప్రియదర్శి హీరోగా రూపొందిన మల్లేశం అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

సినిమా మంచి విజయం సాధించింది. అలాగే ఇందులో అనన్య నాగల్లా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ఈమెకు తెలుగులో మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి సినిమాలను అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన వకీల్ సాబ్ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మరింతగా పెరిగింది. 

ఆ తర్వాత ఈమె మ్యాస్ట్రో , ఊర్వశివో రాక్షసివో , శాకుంతలం ,  మళ్లీ పెళ్లి , పొట్టేల్ వంటి పలు సినిమాలలో నటించింది. ఇప్పటివరకు ఈమె దాదాపు 12 సినిమాల్లో నటిస్తే అందులో కేవలం రెండు మాత్రమే మంచి విజయాలను అందుకున్నాయి. కానీ ఈమెకు వరుస పెట్టి సినిమాలలో అవకాశాలు దక్కుతూనే ఉన్నాయి. ఈ బ్యూటీ సినిమాల్లో అందాలను ఆరబోయడంలో కాస్త వెనకడుగు వేస్తున్న సోషల్ మీడియాలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటూ అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు హీట్ పెంచుతూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: