
కానీ, కెరీర్ పీక్స్‌కు వెళ్తున్న సమయంలో సడెన్‌గా పెళ్లి చేసుకుని వెండితెరకు దూరమైంది. టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా ఫ్యాన్స్ కు దగ్గరగా ఉన్న శ్రీదేవి.. లాంగ్ గ్యాప్ అనంతరం సిల్వర్ స్క్రీన్‌పై రీఎంట్రీకి రెడీ అయింది. అది కూడా హీరోయిన్ గా. నారా రోహిత్ 20వ ప్రాజెక్ట్ `సుందరకాండ`. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో వృతి వాఘాని, శ్రీదేవి హీరోయిన్స్ గా నటించారు.
ఆగస్టు 27న సుందరకాండ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీదేవి.. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలు పంచుకుంది. నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలనుందని, ఏ పాత్ర చేసిన కథలో బలమైన ప్రాధాన్యత ఉండాలని శ్రీదేవి పేర్కొంది. అలాగే తన తొలి సినిమా హీరో ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. `ఈశ్వర్ నుంచి ఇప్పటివరకు ప్రభాస్ తో నా స్నేహం అలానే ఉంది. తానిప్పుడు బిగ్ స్టార్. అయిన కూడా ప్రభాస్ ఏమాత్రం మారలేదు. ఇప్పటికీ చిన్న పిల్లాడిలాగే నవ్వుతూ మాట్లాడతాడు. ఫస్ట్ మూవీ టైమ్‌కే ప్రభాస్ ను చూసేందుకు చాలా మంది వచ్చేవారు. అతను ఎప్పటికైనా స్టార్ అవుతాడని అనుకున్నాను. నేను ఊహించినదానికంటే ప్రభాస్ పెద్ద స్టార్ అయ్యాడు` అని శ్రీదేవి చెప్పుకొచ్చింది.