బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ పేరు వినగానే సినీ ప్రేక్షకులకంటే ఎక్కువగా సామాజిక, రాజకీయ వర్గాలకే గుర్తొస్తుంది. ఎందుకంటే ఆమె ఎప్పుడూ ఉన్నది ఉన్నట్టే చెప్పే వ్యక్తి. ఓ నటిగానే కాకుండా, ఒక సామాజిక కార్యకర్తగా, మహిళా హక్కుల పోరాట యోధురాలిగా, లౌకికవాదానికి గళమెత్తే వ్యక్తిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ‘తను వెడ్స్ మను’, ‘రాంఝణా’, ‘వీరే ది వెడ్డింగ్’ వంటి హిట్ సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న స్వరా, రియల్ లైఫ్ లో కూడా వివాదాలకే హాట్ టాపిక్ అయిపోతుంటుంది. 2023లో సమాజ్‌వాదీ పార్టీ లీడర్ ఫహాద్ అహ్మద్ ను ఆమె వివాహం చేసుకున్నారు. అప్పట్లో కూడా ఆ పెళ్లి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. అయితే తాజాగా స్వరా చేసిన వ్యాఖ్యలు మాత్రం మరోసారి బాలీవుడ్, పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశం అయ్యాయి.


"ప్రతి ఒక్కరూ బైసెక్సువలే" – స్వరా షాకింగ్ కామెంట్! ..తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్వరా మాట్లాడుతూ, “నిజానికి ప్రతి ఒక్కరూ బైసెక్సువలే .. ప్రతి మనిషి అబ్బాయి , అమ్మాయి ఇద్దరి పట్ల ఆకర్షితులు అవుతారు” అని బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇంతటితో ఆగకుండా, తనకైతే అఖిలేష్ యాదవ్ భార్య, ఎంపీ డింపుల్ యాదవ్ పట్ల క్రష్ ఉందని మొహమాటం లేకుండా చెప్పేశారు. ఈ వీడియో బయటకు రాగానే సోషల్ మీడియా లో వైరల్ అవుతూ, ట్రోల్స్ వర్షం కురుస్తోంది. “భర్త ఫహాద్ అహ్మద్, డింపుల్ భర్త అఖిలేష్ యాదవ్ ఈ కామెంట్స్ విని ఏం ఫీలయ్యారో?” అంటూ నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు “సినిమాల్లో బోల్డ్ రోల్స్ చేస్తే ఓకే .. కానీ రియల్ లైఫ్ లో కూడా ఇలానేనా?” అని ప్రశ్నిస్తున్నారు.



డింపుల్ యాదవ్ రెస్పాన్స్ ఏంటి? .. స్వరా భాస్కర్ పేరు ప్రస్తావించిన డింపుల్ యాదవ్ మాత్రం రాజకీయాల్లో బిజీగా ఉంటారు. యాదవ్ కుటుంబం లోకల్, నేషనల్ పొలిటిక్స్ లో బలమైన స్థానం సంపాదించుకుంది. డింపుల్ ఇప్పటివరకూ ఎంపీగా, ముఖ్యమంత్రి భార్యగా, సొంత రాజకీయ ప్రస్థానంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు స్వరా చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు ఆమె ఎలా స్పందిస్తారు? అన్నదే పెద్ద డౌట్ గా మారింది. మొత్తానికి, స్వరా భాస్కర్ మరోసారి తన బోల్డ్ అటిట్యూడ్ తో సోషల్ మీడియాలో హీట్ క్రియేట్ చేశారు. అయితే ఈసారి టాపిక్ సినిమా కాదు .. నేరుగా పొలిటికల్ లీడర్ భార్య పైన చేసిన కామెంట్స్ కావడంతో ఈ వివాదం ఇంకెంత వరకు వెళుతుందో చూడాలి!



మరింత సమాచారం తెలుసుకోండి: