తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు యాంకర్ గా  అదరగొట్టేసింది ఉదయభాను. ఏ సినిమా ఫంక్షన్ జరిగిన ఏ చిన్న ఈవెంట్ జరిగినా తప్పనిసరిగా ఉదయభాను యాంకరింగ్ ఉండాల్సిందే. ఎంతో హుషారుగా యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసేది. అలాంటి ఉదయభాను కొన్నాళ్ల తర్వాత పూర్తిగా తెరమరుగైపోయి పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అయిపోయింది. అయితే అలాంటి ఈమె ఈ మధ్యకాలంలోనే మళ్లీ సినిమాల్లో నటించడానికి వస్తోంది. అయితే ఉదయభాను కు  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే ఆఫర్ వచ్చినా కానీ రిజెక్ట్ చేసిందట. దీనికి కారణం ఏంటి అనేది కూడా ఆమె చెప్పింది..

 ఇక ఉదయభాను త్రిభానదారి బార్బరిక్ అనే సినిమాతో మన ముందుకు రాబోతోంది. ఇందులో సత్యరాజ్ కీలకపాత్రలో నటిస్తున్నారు.  మరి కొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఆమె ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అయితే తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని  తనకు పవన్ కళ్యాణ్ తో ఆఫర్ వచ్చిన  నో చెప్పానని చెప్పింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో  వచ్చినటువంటి అత్తారింటికి దారేది సినిమాలో ఉదయభానును ఒక సాంగ్ కోసం అడిగారట. ఈ చిత్రంతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నటువంటి పార్టీ సాంగ్ కు ఉదయభానును చేయాలని డైరెక్టర్ అడిగితే ఆమె  నేను చేయనని వేరే వాళ్ళని తీసుకోమని చెప్పిందట.

అయితే దీనికి కారణం ఏంటి అనేది తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టింది. అయితే ఈ సాంగ్ ను పెద్దపెద్ద స్టార్స్ మధ్య పవన్ కళ్యాణ్ తో చేయాలి. వాళ్లతో చేయాలంటే నాకు భయం అనిపించింది. అందుకే ముందుగానే అందులో చేయనని చెప్పాను.  ఈ విధంగా నాకు అత్తారింటికి దారేది సినిమాలో చేసే ఛాన్స్ మిస్ అయిందని ఉదయభాను చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఆమె పలు సినిమాల్లో నటిస్తూ  ముందుకు వెళ్తోంది. ఆఫర్లు వస్తే యాంకరింగ్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: