సౌత్ నటుడు అర్జున్ దాస్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన పలు సినిమాల్లో హీరోగా..అతిధి ని పాత్రల్లో..అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణించారు.అలా అర్జున్ దాస్ సినిమాల్లోకి పెరుమాన్ అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.అలా తమిళ ఇండస్ట్రీ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్ దాస్  ఆ తర్వాత తెలుగులో ఆక్సిజన్ అలాగే తెలుగు తమిళ భాషల్లో హిట్ కొట్టిన విక్రమ్, మాస్టర్ వంటి సినిమాల్లో కూడా నటించారు. అలాగే అనిఖా సురేంద్రన్ హీరోయిన్గా చేసిన బుట్ట బొమ్మ మూవీలో కూడా అర్జున్ దాస్ నటించారు. అయితే అలాంటి అర్జున్ దాస్ గురించి తాజాగా కోలీవుడ్ లో ఒక రూమర్ వినిపిస్తోంది. అదేంటంటే అర్జున్ దాస్ మట్టి కుస్తీ భామ ఐశ్వర్య లక్ష్మితో ప్రేమలో ఉన్నారు అంటూ రూమర్లు వినిపిస్తున్నాయి.

 అయితే ఇవి రూమర్లు కాదు నిజమే అంటున్నారు కోలీవుడ్ లో ఉండే చాలామంది వీరి సన్నిహితులు.. అయితే అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి మధ్య ఏమీ లేకపోతే ఇలాంటి రూమర్లు ఎందుకు వినిపిస్తాయి.. ఏదో ఉంటేనే వీరి మధ్య లవ్ రూమర్స్ వినిపిస్తున్నాయి అంటూ సోషల్ మీడియాలో టాక్.. అయితే వీరిద్దరి మధ్య నిజంగానే  ప్రేమాయణం నడుస్తుందని చెప్పడానికి తాజాగా మరొక వార్త వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఐశ్వర్య లక్ష్మి, అర్జున్ దాస్ కాంబోలో ఓ వెబ్ సిరీస్ రాబోతోంది. కాదలిల్ సోదుప్పదు ఎప్పడి ఫేమ్ దర్శకుడు బాలాజీ మోహన్ డైరెక్షన్లో ఓ వెబ్ సిరీస్ రాబోతోంది. అయితే ఈ వెబ్ సిరీస్లో ఐశ్వర్య లక్ష్మి అర్జున్ దాస్ ఇద్దరు కలిసి నటిస్తుండడంతో వీరి మధ్య ఉన్న రూమర్లకు మరింత తావిచ్చినట్టు అవుతోంది.
 అయితే ఐశ్వర్య లక్ష్మి అర్జున్ దాస్ మా మధ్య ఏమి లేదని జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చినప్పటికీ కోడంబాక్కం లో వీరి లవ్ రూమర్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి.. మరి నిజంగానే ఈ జంట ప్రేమలో ఉన్నారా లేక రూమర్సా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఐశ్వర్య లక్ష్మి సినిమాల విషయానికి వస్తే.. తమిళ మలయాళ సినిమాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తమిళ,మలయాళ సినిమాల్లో నటించిన కొన్ని సినిమాలు తెలుగులో విడుదలవ్వడంతో ఆ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయింది. అలా మట్టి కుస్తీ, పొన్నియన్ సెల్వన్ 1, 2, అమ్ము, గాడ్సే, థగ్ లైఫ్ వంటి సినిమాలు చేసింది. ఇక ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటి గట్టు మూవీ లో కూడా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: