
ఇక ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది. కూలీ సినిమా చూపించినట్లుగానే, బజ్ పీక్‌లో ఉన్నప్పుడు ఎన్ఆర్ఐలు ఏదైనా టికెట్ రేట్‌తో పట్టేసే అవకాశం ఉంటుంది. అందుకే ఓజీ డిస్ట్రిబ్యూషన్ టీమ్ ఈ విండోని మాక్సిమమ్‌గా క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. ఎందుకంటే హరిహర వీరమల్లు డిజాస్టర్ కారణంగా కొంతమంది బయ్యర్లు టెన్షన్ పడుతున్నా.. ఓజీ మాత్రం వేరే గేమ్ అనిపించేలా హైప్ బిల్డ్ అవుతోంది. కానీ ఈ హైప్‌ని మైంటైన్ చేయడం ఈజీ కాదని కూడా అందరికీ తెలుసు. ఇటీవలి కాలంలో వార్ 2, కూలీ లాంటి బిగ్ ప్యాన్ ఇండియా సినిమాలు ఊహించినంత రేంజ్‌లో లేవు. వారం గడవకముందే కుప్పకూలిపోయాయి. అలాంటప్పుడు సుజిత్ – పవన్ కాంబో మీద ఇంత భారీ అంచనాలు పెట్టుకోవడం అంటే నిజంగా డేర్. సుజిత్ ఇప్పటివరకూ రెండు సినిమాలు మాత్రమే చేశాడు. సాహో తర్వాత ఇంత గ్యాప్‌లో వచ్చిన ఈ సినిమాను మాత్రం ఫ్యాన్స్ రాజమౌళి లెవెల్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల బిజినెస్ విషయానికి వస్తే, మరో పదిరోజుల్లో పక్కా క్లారిటీ వచ్చేలా ఉంది. కానీ ఏపీ + తెలంగాణ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏదైనా సరే, కనీసం 200 కోట్ల గ్రాస్ అంచనా వేస్తున్నారు. టాక్ బాగుంటే పవన్ కళ్యాణ్ ఊచకోత పూర్తిగా నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుందని ట్రేడ్ గ్యారంటీ ఇస్తోంది. అయితే పవన్ కెరీర్‌లో ఇప్పటివరకు డబుల్ సెంచరీ గ్రాస్ అనే మైలురాయిని అందుకోవడం జరగలేదు. కానీ ఈసారి మాత్రం "ఏమైనా చేయాలి – 200 కోట్ల మార్క్ అందుకోవాలి" అనే డిటర్మినేషన్‌తో పవన్ ఆల్ సెట్ అయ్యారని ఇండస్ట్రీ బజ్. మ్యూజిక్ విషయంలో కూడా తమన్ బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ ఫ్యాన్స్‌ని ఎగరేస్తుంది. ఇక రాబోయే మెలోడీ పాట మరింత బజ్ పెంచే అవకాశం ఉంది. కానీ అన్నింటికన్నా కీలకం ట్రైలర్. దాన్ని సుజిత్ ఎంత పవర్‌ఫుల్‌గా కట్ చేస్తాడో.. ఆ డిసిషన్ బాక్సాఫీస్ మీదే కాక, ఫ్యాన్స్ సెంటిమెంట్ మీద కూడా ప్రభావం చూపబోతోంది. ఇలా చూస్తుంటే ఓజీ నిజంగా బాక్సాఫీస్ గేమ్‌చేంజర్ అవ్వడానికి మాసివ్ బిల్డ్‌అప్ అయిపోతోంది. ఇప్పుడు ఒక్క ట్రైలర్‌తో ఫుల్ వాతావరణం సెట్ చేస్తే, రికార్డుల వేట కేవలం ఓవర్సీస్‌కే కాదు, వరల్డ్‌వైడ్ అవుతుంది.