సౌత్ ఇండస్ట్రీలో జీవిత రాజశేఖర్ లకి మంచి గుర్తింపు ఉంది. ఈ జంట అంటే తెలియని వాళ్ళు ఉండరు. అయితే అలాంటి జీవిత రాజశేఖర్ లపై ఎప్పుడూ ఏదో ఒక ఆరోపణ వస్తూనే ఉంటుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు జీవిత రాజశేఖర్ ఇద్దరు కలిసి నన్ను మోసం చేశారని వాళ్ల స్వార్థం కోసం నన్ను వాడుకున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. మరి ఇంతకీ జీవిత రాజశేఖర్ ఇద్దరు కలిసి ఏ డైరెక్టర్ ని మోసం చేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రాజశేఖర్ సినీ కెరియర్ లో కొన్ని హిట్ సినిమాలు ఉన్నాయి. వాటిలో ఎవడైతే నాకేంటి,సింహరాశి వంటి సినిమాలు కూడా ఉంటాయి. అయితే ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించింది దర్శకుడు వి. సముద్ర..

 ఇక మొదట సింహరాశి సినిమా హిట్ అవ్వడంతో రాజశేఖర్ డైరెక్టర్ సముద్ర తో మరో సినిమా కూడా చేయాలి అనుకున్నారట.అలా తన దగ్గర ఉన్న కథలన్నీ డైరెక్టర్ దగ్గరికి పంపించారట.కానీ డైరెక్టర్ సముద్ర కి ఒక్కటి కూడా నచ్చకపోవడంతో అన్ని రిజెక్ట్ చేశారట. అయితే ఏ కథ పంపినా కూడా రిజెక్ట్ చేస్తున్నారనే కోపంతో నేను పంపిన కథలే రిజెక్ట్ చేస్తారా అని ఇగో పెంచుకున్నారట. కానీ డైరెక్టర్ సముద్రకి ఆ సినిమాలేవి ఆడవని తెలుసు. ఆయన అనుకున్నట్టే రాజశేఖర్ చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఆ తర్వాత ఎలాగైనా హిట్టు కొట్టాలని రాజశేఖర్ పరుచూరి తో ఫోన్ చేయించి ఓ సినిమా కథ చెప్పించారట.ఇక సినిమా నచ్చడంతో సముద్ర దర్శకత్వం చేస్తానని చెప్పారట. అలా డైరెక్టర్ సముద్ర దర్శకత్వంలో మలయాళం లో హిట్ అయిన లయన్ మూవీ ని తెలుగులో తీద్దాం అనుకున్నారట.

అంతేకాకుండా ఈ సినిమాకి ఒక కండిషన్ కూడా పెట్టారట. ఈ సినిమాలో చాలావరకు  స్క్రిప్ట్ మార్చేయాలని.దానికి ఒప్పుకున్న రాజశేఖర్ ఓకే అన్నారట. అలా వీరిద్దరి కాంబోలో ఎవడైతే నాకేంటి సినిమా స్టార్ట్ అయింది.అలా సినిమా మొత్తం బాగుండడంతో రాజశేఖర్ జీవిత ఇద్దరు ఎలాగైనా డైరెక్టర్ సముద్రని తప్పించాలని షూటింగ్ సెట్ కి రావడంతోనే చిరాకుగా మాట్లాడడం.. ఏ సీన్ చేసినా ఇది ఎలా ఉంది అది ఎలా ఉంది అని దెప్పిపొడవడం చేశారట.దాంతో ఇరిటేట్ అయిన సముద్ర సినిమా నుండి తప్పుకున్నారట.ఆ తర్వాత సినీ పెద్దలను తీసుకువచ్చి సినిమా పూర్తి చేసేలా చేశారట.అలా సినిమా పూర్తి చేసే సమయానికి మళ్లీ జీవిత రాజశేఖర్ సినిమా క్రెడిట్ సముద్రకి దక్కకూడదు అనే ఉద్దేశంతో ఆయన్ని అవమానిస్తూ మాట్లాడారట. అలా చివరికి డైరెక్టర్ సముద్ర సినిమా మొత్తం పూర్తి చేశాక రెమ్యూనరేషన్ కూడా సగమే ఇచ్చి ఆయన్ని ఇబ్బందులు పెట్టారట.

దాంతో సముద్ర ఆ సినిమా నుండి తప్పుకున్నారట. అయితే ఇదంతా చేసింది డైరెక్టర్ పేరు స్థానంలో సముద్ర పేరు కాకుండా జీవిత పేరు వేయించాలి అనే స్వార్థం తోనే వాళ్ళు అలా చేశారట.ఫైనల్ గా ఎవడైతే నాకేంటి సినిమాకి సముద్ర పేరుని పక్కన పెట్టేశారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో రాజశేఖర్ దంపతులకు మంచి పేరు వచ్చింది. ఇక ఈ విషయాన్ని వి.సముద్ర తాజా ఇంటర్వ్యూలో చెబుతూ.. ఎవడైతే నాకేంటి సినిమా విషయంలో నన్ను రాజశేఖర్ జీవిత మోసం చేశారు.కేవలం హిట్ క్రెడిట్ వాళ్లకు దక్కడం కోసమే ఇలా చేసారు.అయితే వ్యక్తిగతంగా వాళ్ళిద్దరూ  మంచి వాళ్లే. కేవలం పేరు రావడం కోసమే నన్ను అలా అవాయిడ్ చేశారు. అయితే వాళ్ళు అలా చేసినందుకు నాకేమీ కోపం లేదు.ఇప్పటికి కూడా వాళ్లతో నేను మాట్లాడుతుంటా అంటూ డైరెక్టర్ సముద్ర చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: