మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి తాజాగా తన సోషల్ మీడియా ఖాతా లో పెట్టిన పోస్ట్ చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. ఎప్పుడు ఏదో ఒక విషయం ద్వారా సోషల్ మీడియా లో వైరల్ గా ఉండే ఉపాసన తాజాగా ఖాస్ ఆద్మీ పార్టీ అంటూ ఒక సంచలన పోస్ట్ పెట్టింది. మరి ఆ పోస్ట్ అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా ఉపాసన తన సోషల్ మీడియా ఖాతా లో ఈ విధంగా రాసుకొచ్చింది. చాలామంది నా వారసత్వం వల్లనో లేక నేను రామ్ చరణ్ ని పెళ్లి చేసుకోవడం వల్లనో నాకు ఈ ప్రత్యేకత లభించింది అనుకుంటారు. కానీ అలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే నాకు సమాజం లో ఈ ప్రత్యేకత లభించడానికి ఒకే ఒక్క కారణం ఉంది. 

అదేంటంటే నేను ఏ విషయం లో కూడా గివ్ అప్ ఇవ్వలేదు. ఎన్నో ఇబ్బందులు పడ్డా కూడా తిరిగి సాధించాను. మన సమాజం లో నిజమైన ఖాస్ గా నిలబడాలంటే ఒక వ్యక్తి కి కీర్తి సంపద హోదా అనేది ఉంటే చాలు. నేను ఎంతో ఒత్తిడి అనుభవించాను. మరెన్నో బాధలు చూసాను. ఒక్కొక్కసారి నాకు నేనే అవమానించుకున్నాను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే జీవితం లో ముందుకు వెళ్లాను. చాలా సార్లు కింద పడి మళ్ళీ లేచాను. నా లక్ష్యాన్ని చేరుకోవడం కోసం చాలా కష్టపడ్డాను.

నా కష్టం బాధ ఒత్తిడి ఇవన్నీ అధిగమించుకోగలిగాను. కాబట్టే ఇప్పుడు మీ ముందు ఖాస్ గా నిలబడగలిగాను. అయితే ఈ విషయాలన్నీ మీకు చెప్పడానికి కారణం మీకు సహాయ పడుతుందని.. ఎన్నిసార్లు కింద పడ్డా సరే పైకి లేచి ఎదుగుదాం అంటూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది ఉపాసన. ఇక ఉపాసన పెట్టిన ఈ పోస్ట్ చాలా మందిని ఆలోచింపజేస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: