సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా, మెగా హీరోలకు మాత్రం ఎప్పటికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్లకు ఇచ్చే గౌరవం, స్పెషల్ రెస్పెక్ట్ అన్నది ఇతర హీరోలతో పోలిస్తే ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. దానికి ప్రధాన కారణం ఒకరే… మెగాస్టార్ చిరంజీవి. ఆయన పేరు చెప్పుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ప్రతి మెగా హీరోకి భారీ స్థాయి వెల్కం లభించింది. కొత్తగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వాళ్లకు వచ్చిన  క్రేజ్ అన్నది చిరంజీవి వలననే సాధ్యమైంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. మెగా హీరోలు అందరూ ఒక రూల్‌ని తూచా తప్పకుండా ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఆ రూల్ విషయంలో బన్నీ  మాత్రం కొన్ని కారణాల వలన దూరమయ్యాడనే టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత ఈ చర్చ మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో కొంతమంది “బన్నీ స్వయంగా ఎస్కేప్ అయ్యాడు” అని చెబుతుంటే, మరికొందరు “మెగా ఫ్యామిలీ కావాలనే బన్నీని దూరం పెట్టేసుకుంది” అని అంటున్నారు.


అసలు విషయమేమిటంటే.. మెగా ఫ్యామిలీ మొత్తం చాలా ఏళ్ల క్రితమే ఒక రూల్ తీసుకుంది. అది కూడా చిరంజీవి స్వయంగా తీసుకొచ్చిన నిర్ణయం. ఆ రూల్ ఏమిటంటే.. ఎవరు ఎంత పెద్ద స్టార్ అయినా, ఎంత బిజీగా ఉన్నా, షూటింగ్ షెడ్యూల్స్ ఎంత టైట్‌గా ఉన్నా, కనీసం నెలలో ఒకసారి అయినా అందరూ కలసి ఒక దగ్గర మీట్ అయి.. ఫ్యామిలీ టైమ్ స్పెండ్ చేయాలి. ఒక రోజు అయినా మొత్తం రిలాక్స్ అవుతూ, సరదాగా ఎంజాయ్ చేస్తూ, బంధుత్వాన్ని కాపాడుకోవాలి. ఈ రూల్ వల్లే మెగా ఫ్యామిలీకి ఒక ప్రత్యేకత ఏర్పడింది. సినిమా ప్రపంచంలో ఎంత ఒత్తిడి ఉన్నా, ఎంత టెన్షన్ ఉన్నా, ఫ్యామిలీని కలుపుకొని వెళ్లడం వాళ్లకు అలవాటుగా మారింది. చాలా కాలం వరకు ఈ రూల్‌ని అందరూ పాటించారు.



కానీ పుష్ప సినిమా రిలీజ్ తర్వాత అల్లు అర్జున్‌కి సంబంధించిన కొన్ని సంఘటనలు, ఫ్యామిలీ లోపల ఏర్పడిన అపార్థాలు కారణంగా, బన్నీ ఈ రూల్‌కి దూరమయ్యాడని టాక్ వచ్చింది.  మిగతా మెగా హీరోలు ఇప్పటికీ చిరంజీవి రూల్‌ని క్రమం తప్పకుండా ఫాలో అవుతూనే ఉంటారు.. బన్నీ మాత్రం ఆ ఫ్యామిలీ మీటింగ్స్‌కి హాజరు కావడం మానేశాడట. ఇటీవల కూడా మెగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక ప్రైవేట్ గెదరింగ్ పెట్టుకుని సరదాగా టైమ్ స్పెండ్ చేశారట. ఆ ఫోటోలు బయటకు రాలేదు కానీ ఆ న్యూస్ మాత్రం బయటకు లీకైంది. దీంతో మళ్ళీ బన్నీ గైర్హాజరు గురించి చర్చలు మొదలయ్యాయి.



ఇక అభిమానుల విషయానికి వస్తే, వాళ్లు మాత్రం “బన్నీ మళ్ళీ మెగా ఫ్యామిలీలో తన స్థానాన్ని సంపాదించుకోవాలి. మళ్ళీ పాత రోజుల్లా అందరితో కలిసి ఉండాలి” అని కోరుకుంటున్నారు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అంటే అభిమానులకు ఒక భావోద్వేగం. అందులో ఎవరు దూరమైతే, వాళ్లకు చాలా బాధగానే అనిపిస్తుంది. చూద్దాం మరి… రాబోయే రోజుల్లో బన్నీ మళ్ళీ ఆ ఫ్యామిలీ మీటింగ్స్‌లో కలుస్తాడా? లేక నిజంగానే మెగా ఫ్యామిలీ నుంచి పూర్తిగా వేరైపోతాడా? అన్నది ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోనూ, అభిమానుల మధ్యనూ హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: