
మనందరికీ తెలిసిందే.. జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన మూడో షెడ్యూల్ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది అని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దాంతోపాటు ఒక స్పెషల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. అది అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ రోల్ కోసం మొదట మోహన్‌లాల్‌ను అనుకున్నారట. కానీ ఆయన తప్పుకోవడంతో, ఈ పాత్రకు రజనీకాంత్ పర్ఫెక్ట్ అని ప్రశాంత్ నీల్ సజెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత డైరెక్టర్ స్వయంగా రజనీకాంత్‌ను కలవగా, ఆయన ఓకే చేసినట్టు సమాచారం.
సోషల్ మీడియాలో ఈ వార్త ప్రస్తుతానికి సంచలనంగా మారింది. అసలు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తాడని ఎవరూ ఊహించలేదు. అలాంటి క్రేజీ కాంబినేషన్ సెట్ అవ్వడంతో ఫ్యాన్స్‌లో హైప్ మరింత పెరిగింది. ఈ సినిమాలో ఆయన పూర్తి స్థాయి పాత్రలో కాకపోయినా, కేవలం 10–15 నిమిషాల స్క్రీన్ ప్రెజెన్స్‌తోనే రజనీకాంత్ మరో లెవెల్ హిట్ అందుకుంటాడని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, కొంతమంది రజనీకాంత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అయిన బాషా సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. “ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తే, అది 100 బాషా సినిమాలకు సమానం, ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అవుతుంది” అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరి.. దీని గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో..???