సాధారణంగా ప్రతి ఒక్కరికి చిన్నతనంలో "నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు?" అనే ప్రశ్న తప్పకుండా ఎదురవుతుంది. ఎవరైనా బంధువులు కానీ, ఇంటి పక్క వారు కానీ, స్నేహితులు కానీ అడిగితే, అప్పటి చిన్న మనసుతో ఎవరి నోటికి వచ్చిన సమాధానం వాళ్లు చెప్పేస్తారు. కానీ అది పెద్దయ్యాక నిజం కావాలి అన్న రూల్ అస్సలు ఉండదు. చాలా సార్లు చిన్నప్పుడు చెప్పిన మాటలు అలాగే నిజమవుతాయి, మరికొన్ని సార్లు పూర్తిగా వేరే దారిలో జీవితం మలుపుతిరుగుతుంది. ఇలాంటి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్ గురించి బాగా ట్రెండ్ అవుతోంది.
 

మన రెబెల్ స్టార్ ప్రభాస్ ని చిన్నతనంలో ఎవరైనా ఆయనను "ఏం అవుతావు రా నువ్వు పెద్దయ్యాక?" అని అడిగితే, చాలా ముద్దుగా "డాక్టర్ అవుతాను" అని చెప్పేవాడట. చిన్ననాటి ప్రభాస్‌కి డాక్టర్ అంటే చాలా ఇష్టం. "డాక్టర్ అయితే కోర్టి వేసుకోవచ్చు, మెడలో స్టెతస్కోప్ వేసుకోవచ్చు" అంటూ ముద్దు మాటల్లో చెప్పేవాడని ఆయన బంధువులు చెబుతుంటారు. కానీ చిన్నప్పుడు ఆ కల ఎంత కష్టమైనదో, డాక్టర్ అవ్వడానికి ఎంత చదవాలో, ఎంత కష్టపడి శ్రమించాలో ప్రభాస్‌కి తెలియదు. ఆ విషయాలు పెద్దయ్యాక తెలుసుకున్న తర్వాత "అయ్యో ఇది మన వల్ల కాదు" అని ఆ ఆలోచనను వదిలేశారు. ఆ తర్వాత ఆయన బిజినెస్ రంగంలో సెటిల్ అవ్వాలని అనుకున్నారు. అయితే టాలీవుడ్ లెజెండ్ కృష్ణంరాజు గారిని చూసి ప్రేరణ పొందారు. ఆ ప్రేరణతోనే సినిమారంగంలోకి అడుగుపెట్టారు.



సినీ పరిశ్రమలోకి హీరోగా వచ్చిన తర్వాత ప్రభాస్ వెనక్కి తిరిగి చూడలేదు. "వర్షం" వంటి సినిమాలతో స్టార్‌డమ్ సంపాదించుకుని, "చత్రపతి", "బిల్లా", "డార్లింగ్", "మిస్టర్ పర్ఫెక్ట్" వంటి సూపర్ హిట్స్ ఇచ్చారు. చివరకు "బాహుబలి"తో అయితే ఆయన పేరు పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రతి సినిమా దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా భారీ అంచనాలను సొంతం చేసుకుంటోంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్,ఫౌజి  ల ప్రాజెక్టుల మీద కూడా రెబెల్ అభిమానుల్లో వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆయన స్థాయి, ఆయన క్రేజ్, ఆయన సక్సెస్ చూసి ఎంతోమంది యువ హీరోలు కూడా ఇండస్ట్రీలోకి రావడానికి ప్రేరణ పొందుతున్నారు. ఒకప్పుడు చిన్నతనంలో డాక్టర్ అవ్వాలని కలలు కనిన ప్రభాస్, చివరికి దేశమంతా గర్వపడే "పాన్ ఇండియా స్టార్" గా మారిపోయారు. ఈరోజు ఆయన ఎదిగిన స్థాయిని చూసి నిజంగా గర్వపడకుండా ఉండలేం.

మరింత సమాచారం తెలుసుకోండి: