
అయితే ఒకప్పుడు అలాంటి పరిస్థితి అసలు ఉండేది కాదు. ఆడవాళ్లను థియేటర్లకు రప్పించడం, వాళ్లను ఫ్యాన్స్‌గా మార్చుకోవడం చాలా పెద్ద టాస్క్‌గానే ఉండేది. అలాంటి టఫ్ సిట్యూయేషన్‌లో కూడా ఆ ఘనత సాధించిన అరుదైన హీరోల్లో అగ్రస్థానం పొందినవాడు అక్కినేని నాగార్జున. ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నా, లేడీస్‌ని థియేటర్‌కి రప్పించిన హీరోల్లో నాగార్జున పేరు ఎప్పటికీ ముందుంటుంది. నాగార్జున కంటే ముందు అలాంటి క్రేజ్‌ను సంపాదించిన హీరో శోభన్ బాబు. ఆయన సినిమాల కోసం మహిళలు థియేటర్‌లకు బారులు తీరేవారు. ఆ తరహా స్థానం..ఆ ప్రత్యేకమైన గుర్తింపు తర్వాత నాగార్జునకే దక్కింది. నాగార్జున సినిమాలంటే లేడీస్‌కే కాదు, అబ్బాయిలకు కూడా క్రేజ్ ఉంటుంది. కానీ అమ్మాయిలలో ఆయన ఫాలోయింగ్ మరింత రెట్టింపు స్థాయిలో ఉంటుంది. అంతే కాదు, మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్ హీరోల భార్యలు కూడా నాగార్జునకు హార్డ్‌కోర్ ఫ్యాన్స్ అని పలు సందర్భాల్లో బయటపడింది. ఇది ఆయనకి ఉన్న రేంజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి చాలు.
నాగార్జున నటన స్టైల్, ఆయన డైలాగ్ డెలివరీ, డాన్సింగ్ స్కిల్స్ అన్నీ ప్రత్యేకమైన ఆకర్షణలు. కానీ ముఖ్యంగా ఆయన రొమాంటిక్ సీన్స్‌కి ఉన్న క్రేజ్ వేరే స్థాయిలో ఉంటుంది. అందుకే అప్పట్లో చాలా మంది ఆడవాళ్లు తమ ఇంట్లో భర్తలను ఎదురించి కూడా థియేటర్‌కి వెళ్లి నాగార్జున సినిమాలు చూశారని కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన స్క్రీన్‌పై కనిపించే తీరు, రొమాంటిక్ యాంగిల్, చార్మింగ్ లుక్— అన్నిప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసేవి. నాగార్జున నటించిన ప్రతి సినిమాలోనూ ఆయన పర్ఫార్మెన్స్‌కి మాత్రం వందకి వంద మార్కులు పడతాయి. సినిమా హిట్ అవ్వడం, ఫ్లాప్ అవ్వడం అనేది వేరే విషయం. కానీ ఆయన యాక్టింగ్‌కి మాత్రం ఎప్పుడూ ఎవరూ మైనస్ మార్కులు వేయలేరు. అదే ఆయన గొప్పతనం. ఇంతటి టాలెంటెడ్, హ్యాండ్సమ్, చార్మింగ్ హీరో మన తెలుగు సినీ పరిశ్రమలో ఉండటం నిజంగా ఇండస్ట్రీకే గర్వకారణం. ఇప్పుడు ఆయన కి 66 ఏళ్ల వయసు..ఇంకా అదే చార్మ్, అదే ఎనర్జీ, అదే హ్యాండ్సమ్ లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఈ రోజు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియా వేదికగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా, నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నారు.