పోర్న్ స్టార్ గా బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న నటి సన్నిలియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తెలుగు, హిందీలలో కూడా ఎన్నో చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో కనిపించి భారీగానే ఫేమస్ అయ్యింది. కానీ సేవ గుణంతో కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది సన్నిలియోన్. ప్రస్తుతం సన్నీలియోన్ కి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముఖ్యంగా ఏదైనా సెలబ్రేషన్స్ , పండుగలు అయినా సరే తన ముగ్గురు పిల్లలు భర్తతో కలిసి దిగిన  ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.


సన్నీ లియోన్ ఫ్యామిలీలో ఒక పాపను దత్తకు తీసుకోగా మరో ఇద్దరు అబ్బాయిలు ట్విన్స్ జన్మించారు. ఈ ఇద్దరు అబ్బాయిలను సరోగసి విధానం ద్వారా సన్నిలియోన్ కన్నది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సన్నీలియోన్ తాను సరోగసి విధానాన్ని ఎంచుకోవడానికి గల కారణాలను వెల్లడించింది. తనకు పిల్లలంటే చాలా ఇష్టమని.. పిల్లలను దత్తకు తీసుకోవాలనే ఆలోచన తన మనసులో కొన్నేళ్ల నుంచి ఉండేది.. ఐవిఎఫ్ ఫెయిల్ అయిన రోజున పిల్లలను దత్తకు తీసుకోవడం కోసం అప్లికేషన్ పెట్టుకున్నాము. ఆ సమయంలోనే ఒక పాపను సెలెక్ట్ చేసుకొని దత్తకు తీసుకున్నామని తెలిపింది.



ఇక సరోగసి విషయానికి వస్తే తాను గర్భం దాల్చి పిల్లల్ని కడుపున మోయడం ఇష్టం లేదని అందుకే ఈ పద్ధతిని పెంచుకోవలసి వచ్చిందని తెలిపింది. పిల్లలంటే ఇష్టమే.. కానీ ఎందుకో ఈ పని చేయడం ఇష్టం లేదంటూ తెలిపింది. అలా సరోగసి కోసం ఎంచుకున్న మహిళకు కూడా ప్రతి వారము కొంత డబ్బు చెల్లించాము.. అలాగే ఆమె భర్తకు కూడా చాలానే డబ్బులు ఇచ్చాము. వారు ఆ డబ్బుతో ఒక పెద్ద ఇల్లే కట్టుకున్నారు. ఆమె మళ్ళీ ఘనంగా వివాహం చేసుకుందంటూ తెలిపింది సన్నిలియోన్. సన్నీలియోన్ ప్రముఖ నటుడు అయినా డేనియల్ వెబర్ ను 2011లో వివాహం చేసుకుంది. కానీ 2017లో ఈ జంట నిషా అనే ఒక పాపను దత్తకు తీసుకున్నారు. ఆ మరుసటి ఏడాదే సరిగసి ద్వారా నోవా, ఆషర్ అనే ఇద్దరు అబ్బాయిలకు తల్లిదండ్రులుగా మారారు.

మరింత సమాచారం తెలుసుకోండి: