చిరంజీవి పెళ్లికి అల్లు అరవింద్ తమ్ముడి చావుకి మధ్య ఉన్న లింక్ మీకు తెలుసా అంటే చాలామంది ఇంతకీ అల్లు అరవింద్ కి తమ్ముడు ఎక్కడి నుండి వచ్చారు..  ఇప్పటివరకు మాకు తెలియదే అనుకుంటారు.ఎందుకంటే అల్లు అరవింద్ కి తమ్ముడు ఉన్నారనే విషయం చాలా మందికి తెలియదు.. అయితే అందరికీ తెలియని ఒక నిజం ఏంటంటే.. అల్లు రామలింగయ్య అల్లు కనక రత్నంలకి అల్లు అరవింద్ జన్మించాక మరో కొడుకు కూడా పుట్టారట. అయితే ఆ కొడుకు యుక్త వయసుకు వచ్చాక అనారోగ్య కారణాలతో మరణించారట. అయితే కొడుకు మరణం జీర్ణించుకోలేని కనక రత్నం తరచూ బాధపడుతూ మానసిక వేదనకు గురైందట. అలాంటి సమయంలోనే చిరంజీవి అల్లువారింటి అల్లుడయ్యారు. అయితే చిరంజీవి అల్లు ఫ్యామిలీ కి అల్లుడవ్వడం వెనుక కూడా కనక రత్నం హస్తమే ఎక్కువగా ఉంది. 

ఎందుకంటే ఓ రోజు చిరంజీవి అల్లు రామలింగయ్య ఇంట్లో రెంటుకు ఉండే వ్యక్తిని కలవడానికి వచ్చి కనక రత్నం కంట్లో పడ్డాడు.ఇక చిరంజీవిని చూసి కనకరత్నం చాలా ఎమోషనల్ అయిందట. ఎందుకంటే అప్పుడు చిరంజీవి అచ్చం తన చనిపోయిన కొడుకు రూపురేఖలతోనే ఉండడంతో ఆయన్ని కొడుకులానే భావించిందట.ఇక ఇదే సమయంలో సురేఖకు అల్లు రామలింగయ్య సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం కనకరత్నం చెవిన పడడంతో అల్లు రామలింగయ్య దృష్టిలోకి చిరంజీవి పేరును తీసుకువచ్చింది. అలా అప్పుడప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న చిరంజీవిని తమ ఇంటి అల్లుడిగా చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఫైనల్ గా చిరంజీవి సురేఖల పెళ్లి జరిగింది.

ఇక చిరంజీవి తమ ఇంటి అల్లుడిగా వచ్చాక కనకరత్నం అల్లుడిని దగ్గరుండి చూసుకోవడమే కాకుండా సొంత కొడుకులాగే ప్రేమను పంచేదట. అందుకే చిరంజీవి ప్రతిసారి తన తల్లిదండ్రులతో పాటు అత్తమామలు అయినటువంటి అల్లు రామలింగయ్య కనకరత్నంలను కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు.అలాగే కనక రత్నం గారి వ్యక్తిత్వాన్ని దగ్గరుండి చూసిన చిరంజీవి ఆ ఇంటికి అల్లుడిలా కాకుండా కొడుకులా వెళ్లాడు. అలా కనక రత్నం కొడుకు మరణించిన బాధ నుండి కోలుకోవడానికి ఒక రకంగా చిరంజీవే అని చెప్పుకోవచ్చు.చిరంజీవి ఇంటి అల్లుడయ్యాక చనిపోయిన కొడుకుని కనకరత్నం గారు మర్చిపోయారట.

మరింత సమాచారం తెలుసుకోండి: