
అప్పుడు ప్రభాస్ వద్దన్నాడు..ఇప్పుడు చరణ్ రిజెక్ట్ చేశాడు..ఈ హీరోయిన్ పూర్తి దరిద్రంలో ఉన్నట్లుందే..!

అయితే, ఈ ట్రెండ్‌లో మాత్రం ఒక హీరోయిన్ విషయంలో పూర్తిగా రివర్స్ సీన్ జరుగుతోంది. ఆమె ఎవరో కాదు, ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్లలో టాప్ ప్లేస్ సంపాదించుకున్న శ్రీలీల. చిన్న వయస్సులోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో పాటు గ్లామర్ డోస్‌తో కూడా అభిమానులను, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుని, తన కెరీర్‌ను అద్భుతంగా బిల్డ్ చేసుకుంటుందనుకున్నారు చాలామంది. కానీ ఆ మధ్యలో ఆమె కొన్ని సినిమాలు ఎంపిక చేసే విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఆమె ఇమేజ్ ని డౌన్ ఫాల్ చేశాయి. దాంతో ఆమె కెరీర్ డిజాస్టర్ గా మారింది. వరుస ఫ్లాప్‌లతో ఆమె గ్రాఫ్ కిందకు పడిపోయింది.
ఇప్పుడు పరిస్థితి అంత దారుణంగా మారింది, స్టార్ హీరోలు కూడా శ్రీలీలను తమ సినిమాల్లో తీసుకోవడానికి ఇష్టపడటం లేదట. గతంలో ప్రభాస్ నటిస్తున్న "రాజసాబ్" సినిమాలో మారుతి శ్రీలీలను హీరోయిన్‌గా తీసుకుందామనుకున్నారు. అయితే ప్రభాస్ మాత్రం ‘ఈ సినిమాలో శ్రీలీల వద్దు’ అని స్పష్టంగా చెప్పేశాడన్న వార్త వైరల్ అయ్యింది. ఆ సమయానికి ఈ నిర్ణయానికి కారణం హైట్ మ్యాచ్ అవ్వకపోవడమేనని క్లారిటీ కూడా వచ్చింది. ఇప్పుడు అదే పరిస్థితి మరోసారి చోటు చేసుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా శ్రీలీలను తమ కొత్త సినిమాలో హీరోయిన్‌గా చూడడానికి నిరాకరించారట. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తరువాత సుకుమార్ డైర్క్షన్ లో ఓ సినిమా రాబోతుంది. అందుకే సుకుమార్ ఈ సినిమాకు హీరోయిన్ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. లిస్టులో శ్రీలీల పేరు కూడా వచ్చినప్పటికీ, రామ్ చరణ్ మాత్రం స్పష్టంగా ‘శ్రీలీల వద్దు’ అని చెప్పారట. అయితే ఆయన తీసుకున్న ఈ నిర్ణయానికి కారణం ఏమిటన్నది మాత్రం బయటకు రాలేదు.
ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ అవుతోంది. “శ్రీలీల ఇంత డౌన్‌ఫాల్‌లో ఉందా?”, అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్‌లో అగ్రశ్రేణి హీరోలతో వరుసగా సినిమాలు చేసిన ఈ గ్లామర్ డాల్ ఇప్పుడు ఎందుకు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోందో అనే చర్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సినీ ప్రముఖులు చెబుతున్నట్టుగా, శ్రీలీల గతంలో తీసుకున్న కొన్ని తప్పు నిర్ణయాలే ఈ పరిస్థితికి కారణమని అంటున్నారు. శ్రీలీల కూడా ఈ నెగిటివిటీని పాజిటివిటీగా మార్చుకొని మళ్లీ పెద్ద లెవెల్‌లో రాణిస్తుందని నమ్ముతున్నారు. మంచి స్క్రిప్ట్‌లు, సరైన నిర్ణయాలు తీసుకుంటే ఆమె మళ్లీ టాప్ హీరోయిన్‌గా రీ-ఎంట్రీ కొట్టడం ఖాయం అంటున్నారు. శ్రీలీల ఇప్పుడు ఏ ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటుందో, ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్తుందో చూడాలి. ఎందుకంటే టాలీవుడ్‌లో టాలెంట్‌కు, కష్టపడే వారికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది.