టాలీవుడ్ యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా కిష్కిందపురి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. గతంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో గా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా రూపొందిన రాక్షసుడు సినిమా మంచి విజయం సాధించడంతో వీరి కాంబోలో వచ్చిన రెండవ సినిమా అయినటువంటి కిష్కిందపురి మూవీ కూడా మంచి విజయం అందుకుంటుంది అని చాలా మంది అభిప్రాయ పడ్డారు. ఇకపోతే ఈ రోజు అనగా సెప్టెంబర్ 12 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ను నిన్న రాత్రి నుండి అనగా సెప్టెంబర్ 11 వ తేదీ నుండి కొన్ని ప్రాంతాలలో ప్రదర్శించడం మొదలు పెట్టారు. ఈ మూవీ ప్రీమియర్స్ కు ప్రేక్షకుల నుండి మంచి టాక్ వస్తుంది. దానితో ఈ సినిమాకు మొదటి రోజు మంచి ఓపెనింగ్లు లభించే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. అలాగే ఈ మూవీ కి మొదటి రోజు కూడా మంచి టాక్ వచ్చినట్లయితే ఈ సినిమా లాంగ్ రన్ లో కూడా భారీ కలెక్షన్లను వసూలు చేసి మంచి విజయాన్ని అందుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అని కూడా అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన సాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను ఓ ప్రముఖ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను జీ 5 ఓ టీ టీ సంస్థ దక్కించుకున్నట్లు , ఈ సినిమా యొక్క సాటిలైట్ హక్కులను జీ తెలుగు సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ థియేటర్ రన్ కొన్ని వారాలు ముగిశాక జీ 5 ఓ టీ టీ లోకి ఈ సినిమా రానున్నట్లు , ఆ తర్వాత కొన్ని వారాలకు జీ తెలుగులో ఈ సినిమా ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bss