
సినిమా కథ పూర్తిగా ఒక మైథాలజికల్-ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ తరహాలో సాగుతుంది. కలింగ యుద్ధం తర్వాత పశ్చాత్తాపానికి లోనైన మహారాజు అశోకుడు, తనలోని అసాధారణ శక్తులను తొమ్మిది పవిత్ర గ్రంథాల రూపంలో భూమి నలుమూలలలోని తొమ్మిది మంది రక్షకులకు అప్పగిస్తాడు. శతాబ్దాలు గడిచే కొద్దీ ఈ గ్రంథాలను సాధించి, తాను భగవంతునిలా మారాలని ప్రయత్నించే క్రూరశక్తి కథలో ప్రవేశిస్తుంది. ఈ క్రమంలో వేదరాముల కాలం నాటి వారసురాలు మీరాయి, ఆ శక్తుల కోసం జరుగుతున్న రక్తపాతం మధ్య రక్షకుడిగా ఎలా నిలబడింది, ఆ శక్తులను దుర్వినియోగం చేయాలనుకునే దుష్టశక్తిని ఎలా ఎదుర్కొంది అన్నదే సినిమా ప్రధాన కాన్సెప్ట్.
ఈ కథనం ఇప్పటివరకు మనం తెలుగుతెరపై చూసిన ఫాంటసీ కథలతో పోలిస్తే చాలా భిన్నంగా, వినూత్నంగా ఉండటం గమనార్హం. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈ కాన్సెప్ట్‌ను ప్రజలకు అర్థమయ్యే రీతిలో చక్కగా ప్రెజెంట్ చేశారు. అడపాదడపా కొన్ని సన్నివేశాలు అంతగా రీచ్ కాకపోయినా, మిగతా సీన్స్‌లో మాత్రం చాలా రియలిస్టిక్‌గా తీసి ప్రేక్షకులను మెప్పించారు. అద్భుతమైన విజువల్స్, శ్రద్ధపూర్వకంగా డిజైన్ చేసిన సెట్‌లు, రియలిస్టిక్ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు పెద్ద హైలైట్‌గా నిలిచాయి. హీరో తేజ ఈ సినిమాలో తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని రోల్‌ను ప్రయత్నించాడు. ఒక రక్షకుడిగా, యోధుడిగా ఆయన జర్నీని దర్శకుడు చాలా నీట్‌గా డిజైన్ చేశారు. అడ్వెంచర్ సీన్స్‌లో తేజ చేసిన కృషి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది ప్రేక్షకులు, సినీ అభిమానులు “ఈ కథలో హీరోగా నేచురల్ స్టార్ నాని నటించి ఉంటే ఇంకా బాగా సూట్ అయ్యేది. ఈ కథకు తేజ ఇమేజ్ అంతగా సరిపోలేదు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా నాని నటించి ఉంటే ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అయ్యేదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.
అయినా తేజ చేసిన యాక్షన్ సీన్స్, అతని అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమా ఆకట్టుకుంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి పెద్ద పాజిటివ్ పాయింట్స్‌గా నిలిచాయి. హీరో తేజకు ఈ సినిమా మరో మైలురాయిగా నిలవడం ఖాయం. “మీరాయి” సినిమా రివ్యూ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ కథనం, విజువల్స్, టెక్నికల్ వర్క్‌తో ఈ చిత్రం టాలీవుడ్‌లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోబోతోందని ఇండస్ట్రీ వర్గాలు కూడా అంటున్నాయి. ఫాంటసీ, మైథాలజీ కలయికలో తీసిన ఈ సినిమా రాబోయే రోజుల్లో మరింత పాజిటివ్ మౌత్‌టాక్ సాధించి, కలెక్షన్స్‌లోనూ మంచి రికార్డులు సృష్టించే అవకాశం ఉంది అంటున్నారు అభిమానులు..!!