మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పుడూ తన అభిమానులను ఆనందపరచడానికి, ఎంటర్టైన్ చేయడానికి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఆయన తీసుకునే ఆ నిర్ణయాలు అభిమానులను మాత్రమే కాదు, ఫిలిం ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఆశ్చర్యపరుస్తాయి. తాజాగా చరణ్ అలాంటి ఓ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నాడనే వార్త ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే మనందరికీ తెలిసిందే, రామ్ చరణ్ ప్రస్తుతం ఓ భారీ పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ బుచ్చి బాబు సనా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయింది. ఇక కేవలం 20 శాతం మాత్రమే బ్యాలెన్స్‌గా మిగిలి ఉందని సమాచారం. అందులో ఒక పాట, క్లైమాక్స్ సీక్వెన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయట.


ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర చాలా డిఫరెంట్‌గా, ఇప్పటివరకు ఆయన చేయని రీతిలో ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు. చరణ్ ఇందులో ఒక క్రికెట్ ప్లేయర్‌గా కనిపించబోతున్నారని టాక్. అలాగే ఆయన లుక్స్, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టర్ ప్రెజెంటేషన్ పూర్తిగా న్యూ యాంగిల్‌లో ఉండబోతుందని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ ఎమోషనల్ పీక్‌లో ఉండబోతోందని, ప్రతి అభిమాని థియేటర్లో కన్నీళ్లు పెట్టుకునేలా చేస్తుందని టీమ్ బజ్ క్రియేట్ చేస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా టైమ్ ఉంది. కాబట్టి ఆ గ్యాప్‌లో అభిమానులను ఇంప్రెస్ చేయడానికి, సర్ప్రైజ్ ఇవ్వడానికి రామ్ చరణ్ ఒక ప్రత్యేక ప్లాన్ చేశాడు.

 

లేటెస్ట్ బజ్ ప్రకారం చరణ్ ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్‌కి బ్రాండ్ అంబాసడర్‌గా ఎంపికయ్యాడట చరణ్. ఆ ప్రోడక్ట్ ప్రమోషన్ కోసం ఆయన ఒక గ్రాండ్ యాడ్ షూట్ చేశారట. ఆ యాడ్‌ని సింపుల్‌గా టీవీ లేదా యూట్యూబ్‌లో కాకుండా, నేరుగా థియేటర్లలో రిలీజ్ చేయాలని ఆ యాడ్ మేకర్స్ ఫిక్స్ అయినట్లు సమాచారం. చరణ్‌కి ఉన్న పాపులారిటీ, క్రేజ్, గ్లోబల్ ఇమేజ్ ఆ ప్రోడక్ట్‌కి అద్భుతమైన పబ్లిసిటీ ఇస్తుందని కంపెనీ నమ్మకంగా భావిస్తోంది. అందుకే ఆయనకు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి, ఈ యాడ్‌లో నటింపజేశారు అని టాక్. త్వరలోనే ఈ యాడ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. అదే నిజమైతే, పెద్ది  సినిమా రాకముందే రామ్ చరణ్‌ని పెద్ద తెరపై అభిమానులు చూడగలిగే అవకాశమొస్తుంది. ఈ న్యూస్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానుల్లో భారీ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: