
సెన్సార్ బోర్డు నుంచి ఓజి చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది. OG చిత్రంలో యాక్షన్, ఎమోషన్స్ కలిపిన సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్ర బృందం కూడా ధీమాని తెలియజేస్తోంది. ఈ సినిమా టెక్నికల్ విలువల పరంగా యాక్షన్ సన్నివేశాల పరంగా కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకేక్కించారు. డివిడి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లోనే నిర్మించారు. పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమ కూడా ఈ ఓజి సినిమా కోసం చాలా ఆత్రుతగాని ఎదురుచూస్తోంది. మరి ఓజి సినిమా ఉండే అంచనాలకు ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి.
ఈ ఏడాది వచ్చిన హరిహర వీరమల్లు చిత్రం మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. అంతేకాకుండా ఇందులో ఉపయోగించిన విఎఫ్ఎక్స్ కూడా నాసిరకంగా ఉండడంతో పవన్ కళ్యాణ్ పైన చాలా దారుణమైన ట్రోల్స్ కూడా వినిపించాయి. అభిమానులు కూడా నిరాశ చెందారు,ఒకవైపు పవన్ కళ్యాణ్ సినిమాలు మరొకవైపు పొలిటికల్ పరంగా అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళుతున్నారు. అలాగే పొలిటికల్ పరంగా కూడా జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నారు.