ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఈరోజు నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఈరోజు ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అలాగే 10 గంటలకు శాసనమండలి సమావేశాలు మొదలు కాబోతున్నాయి. అసెంబ్లీ సమావేశం వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో అసెంబ్లీకి సంబంధించిన సమావేశాలను ఎన్ని రోజులపాటు నిర్వహించాలనే విషయం చర్చించబోతున్నారు. మరి ఈ వర్షాకాలపు సమావేశాలకు అయినా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యే పరిస్థితి ఉందా? లేదా అనే అనుమానాలు మొదలవుతున్నాయి.



ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలోకి అడుగు పెడతామంటూ అటు వైసిపి ఎమ్మెల్యేలు, అధినేత జగన్ కూడా పట్టుదలతో ఉన్నారు.దీన్ని బట్టి చూస్తే  గతంలో లాగే కేవలం మండలి సభ్యులు మాత్రమే ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాబోతున్నారు. అయితే ఎమ్మెల్యేలు అందరిని కూడా అసెంబ్లీకి రావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా వారి ప్రాంతాలలోని సమస్యలను సైతం పరిష్కరించడానికి ఇదే గొప్ప అవకాశమని.. సభాపతి స్థానాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిదీ అంటూ తెలియజేశారు. ఈమెరకు వైసిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా తిరగడం మంచిది కాదు అంటూ తెలియజేశారు స్పీకర్.

మరి ఈ సమావేశాలకు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వస్తారా? రారా ?అనే విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాలను హాట్ టాపిక్ గా మారుతోంది. సోషల్ మీడియాలో మాత్రం ఈసారి జగన్ కచ్చితంగా కనిపిస్తారని పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం కనిపిస్తోంది. ఇప్పటివరకు ఈ విషయం పైన ఏ విధమైనటువంటి పూర్తి క్లారిటీ రాలేదు. ఇటీవలే జగన్ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలను లేవనెత్తేందుకు అసెంబ్లీలోకి వెళ్తే వారు మైక్ ఇవ్వరని, తగిన సమయం కూడా కేటాయించారని తెలియజేశారు. మరి ఇటువంటి సందర్భంలో జగన్ వస్తారా? రారా అనే విషయం మరొక కొన్ని గంటలలో తెలియబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: